Headlines

ఉల్లాస్ – అక్షరాంధ్ర (2025-26)

తేది. 22-09-2025 న ఉదయం గం.11:30 లకు శ్రీయుత జిల్లా కలక్టరు,
విజయనగరం వారు మరియు సంయుక్త కలక్టరు, విజయనగరం వారు జిల్లా కలక్టరు వారి
సమావేశమందిరము నందు “ULLAS” – అక్షరాంధ్ర (2025-26) అక్షరాస్యతా కార్యక్రమము
నూతన వాచకముల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడమైనది.

ఈ కార్యక్రమంలో ఉల్లాస్ – అక్షరాంధ్ర (2025-26) అక్షరాస్యతా కార్యక్రమం
విజయనగరం జిల్లాలో నిర్వహించుటకు సంబందిత శాఖల సమన్వయముతో ఆ శాఖలు
ద్వారా అమలు చేయవలసిన అంశాలను నోడల్ అధికారి, వయోజన విద్య వారు
వివరించియున్నారు.

జిల్లా టార్గెట్ 1,10,915 నిర్దేశించగా ఈ కార్యక్రమంలో PD DRDA వారి ద్వారా 60715
మంది మహిళా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయుటకు, అర్బన్ ప్రాంతంలో మెప్మా, PD
వారి ద్వారా 12000 మంది మహిళా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయుటకు మరియు
PD DWMA వారి ద్వారా 38200 మంది పురుష నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా
చేయుటకు, అభ్యసనా తరగతులు నిర్వహణ కు అవసరమైన అన్ని చర్యలు
తీసుకోవలసినదిగా శ్రీయుత జిల్లా కలక్టరు, విజయనగరం వారు జిల్లా సమన్వయ కమిటీ
సభ్యులకు ఆదేశించియున్నారు.

ఈ కార్యక్రమంలో PD DRDA, CEO జిల్లా పరిషత్, PD MEPMA, PD DWMA,
PD WD&CW, DPO, DEO, GSWS Nodal Officer, DPRO మరియు నోడల్ అధికారి,
వయోజన విద్య శ్రీ ఏ.వేణు గోపాల కృష్ణ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

A.N.G.
నోడల్ అధికారి
వయోజన విద్య, విజయనగరం.
22/09/25.

ఉల్లాస్ – అక్షరాంధ్ర (2025-26)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *