Headlines

కొనసాగుతున్న భారీ వరద

శ్రీరాం సాగర్‌ 40 గేట్లు, నిజాం సాగర్‌ 10 గేట్లు ఎత్తివేత
నవతెలంగాణ-మెండోరా/నిజాంసాగర్‌

ఎగువ ప్రాంతాలతో పాటు జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు సోమవారం కురిసిన భారీ వర్షానికి నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాం, నిజాం సాగర్‌ ప్రాజెక్టులకు భారీ వరద కొనసాగుతోంది. శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టులోకి ప్రస్తుతం 2,16,455 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా.. 40 గేట్లు ఎత్తి అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే, ఎస్కేప్‌ గేట్ల ద్వారా 2500 క్యూసెక్కులు, ఇందిరమ్మ వరద కాలువ ద్వారా 6735, కాకతీయ కాలువ ద్వారా 4000, సరస్వతీ కాలువ ద్వారా 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే, నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి 68,233 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరగా.. 10 వరద గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. మంజీరా నదిలోకి 77,446 క్యూసెక్కుల నీటిని, ప్రధాన కాలువ ద్వారా 1,000 క్యూసెక్కుల నీటిని వదలుతున్నట్టు ప్రాజెక్టు ఏఈఈలు సాకేత్‌, అక్షరు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 17.802టీఎంసీలకు గాను ప్రస్తుతం 16.136 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్టు చెప్పారు. కాబట్టి కాలువ, నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

The post కొనసాగుతున్న భారీ వరద appeared first on Navatelangana.

​శ్రీరాం సాగర్‌ 40 గేట్లు, నిజాం సాగర్‌ 10 గేట్లు ఎత్తివేతనవతెలంగాణ-మెండోరా/నిజాంసాగర్‌ఎగువ ప్రాంతాలతో పాటు జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు సోమవారం కురిసిన భారీ వర్షానికి నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాం, నిజాం సాగర్‌ ప్రాజెక్టులకు భారీ వరద కొనసాగుతోంది. శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టులోకి ప్రస్తుతం 2,16,455 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా.. 40 గేట్లు ఎత్తి అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే, ఎస్కేప్‌ గేట్ల ద్వారా 2500 క్యూసెక్కులు, ఇందిరమ్మ
The post కొనసాగుతున్న భారీ వరద appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *