Headlines

చౌట్ పల్లిలో మహిళా వైద్య శిబిరం 

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని చౌట్ పల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం మహిళా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో మహిళ వైద్య నిపుణులు డాక్టర్ శ్వేతా, కంటి ఆప్తమాలిక్ ఆఫీసర్ గుర్రాజు పాల్గొని  సేవలందించారు. స్వస్తి నారి, స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ మహిళ వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు ఆస్పత్రి వైద్యాధికారిని డాక్టర్ స్పందన తెలిపారు. ఈ శిబిరంలో స్త్రీలలో వచ్చే సమస్యలకు డాక్టర్ శ్వేత వైద్య సేవలు అందించారు. మహిళలు ఆరోగ్యం విషయంతో తీసుకోవాల్సిన ఆహారం, పలు జాగ్రత్తలను పై అవగాహన కల్పించారు.

కంటి సమస్యలతో వచ్చిన వారికి ఆప్తమాలిక్ గుర్రాజు కంటి పరీక్షలు నిర్వహించి, వారికి కంటి అద్దాలను అందించారు. కంటి ఆపరేషన్లు అవసరమైన వారిని జిల్లా కేంద్ర ఆసుపత్రికి రెఫర్ చేశారు. శిబిరంలో 231 మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా రక్త పరీక్షలతో పాటు మందులను అందజేశారు. కార్యక్రమంలో వైద్యాధికారి స్పందన, ఆస్పత్రి ఆరోగ్య విస్తరణ అధికారి సత్యనారాయణ, సూపర్వైజర్ స్వరూప, ల్యాబ్ టెక్నీషియన్స్ పవన్ కుమార్,  రాంబాబు, ఫార్మసిస్ట్ అరుణ్, కీర్తి, దివ్య, దుర్గ, జయ, ఋషి, శ్యామల, అరుణ, విజయలక్ష్మి, శోభారాణి, సుప్రియ, గీత, ప్రసన్న, డీఈఓ మధు, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

The post చౌట్ పల్లిలో మహిళా వైద్య శిబిరం  appeared first on Navatelangana.

​నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండలంలోని చౌట్ పల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం మహిళా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో మహిళ వైద్య నిపుణులు డాక్టర్ శ్వేతా, కంటి ఆప్తమాలిక్ ఆఫీసర్ గుర్రాజు పాల్గొని  సేవలందించారు. స్వస్తి నారి, స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ మహిళ వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు ఆస్పత్రి వైద్యాధికారిని డాక్టర్ స్పందన తెలిపారు. ఈ శిబిరంలో స్త్రీలలో వచ్చే సమస్యలకు డాక్టర్ శ్వేత వైద్య సేవలు అందించారు. మహిళలు ఆరోగ్యం
The post చౌట్ పల్లిలో మహిళా వైద్య శిబిరం  appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *