Headlines

విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులను అరెస్టు చేయాలి..

అడిషనల్ ఎస్పి, ఎస్సై, తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత..
కుబీర్ మండల కురుమ కుల సంఘం..
నవతెలంగాణ – కుభీర్
లోకేశ్వరం మండలం రాయపూర్ కాండ్లీ లో బీరప్ప దేవుని విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనపై కుబీర్ మండల కురుమ కులస్తులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై భైంసా అడిషనల్ ఎస్పి అవినాష్, ఎస్సై కృష్ణారెడ్డి, తాసిల్దార్ శివరాజ్ లకు కుబీర్ మండల  కురుమ కులస్తులు ఆయా పోలీస్ స్టేషన్లో, తాసిల్దార్ కార్యాలయంలో సోమవారం వినతి పత్రాలను అందజేశారు.

  ఈ సందర్బంగా దుండగులను తక్షణమే గుర్తించి అదుపులకు తీసుకొని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయినాథ్, నిమ్మ బీరు, డోలేవార్ కామాజీ, మాజీ ఉపసర్పంచ్ దత్తాత్రి, కుబీర్ సంఘం అధ్యక్షుడు దత్తాత్రి, డోలేవార్ పోతన్న, సాయినాథ్, బాబన్న, దేవన్న, టేకులవార్ బాలాజీ, నాగేష్, సాయినాథ్, ఈరన్న, ఆయా గ్రామ కురుమ కులస్తులు తదితరులు ఉన్నారు.

The post విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులను అరెస్టు చేయాలి.. appeared first on Navatelangana.

​అడిషనల్ ఎస్పి, ఎస్సై, తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత..కుబీర్ మండల కురుమ కుల సంఘం..నవతెలంగాణ – కుభీర్లోకేశ్వరం మండలం రాయపూర్ కాండ్లీ లో బీరప్ప దేవుని విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనపై కుబీర్ మండల కురుమ కులస్తులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై భైంసా అడిషనల్ ఎస్పి అవినాష్, ఎస్సై కృష్ణారెడ్డి, తాసిల్దార్ శివరాజ్ లకు కుబీర్ మండల  కురుమ కులస్తులు ఆయా పోలీస్ స్టేషన్లో, తాసిల్దార్ కార్యాలయంలో సోమవారం వినతి పత్రాలను
The post విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులను అరెస్టు చేయాలి.. appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *