రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్రారెడ్డి పిలుపు
విశాలాంధ్ర ధర్మవరం; రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు, సంబంధించిన విద్యారంగ సమస్యలు మరియు ఆర్థిక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్న డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 15 వ తేదీ నుండి 19 తేది వరకు రాష్ట్ర వ్యాప్తంగా యుటిఎఫ్ నిర్వహించిన రణభేరి కార్యక్రమం లో ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయడం జరిగిందని సెట్టిపి జయచంద్ర రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల నిర్ణయం రానందున సెప్టెంబర్ 25 వ తేదీన శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం గుంటూరు నందు రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు శ్రీ సత్య సాయి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు హాజరై సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని కోరుతూ ధర్మవరం పట్టణంలోని యుటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో రణభేరి గోడపత్రికలను ఆవిష్కరించారు. గుంటూరు రణభేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు 12వ పిఆర్సి వర్తింపు చెయ్యాలని, పి ఆర్ సి కమిటీ చైర్మన్ నియామకం ఆలస్యమైతే 29 శాతము మధ్యంతర భృతిని ప్రకటించాలని, బకాయి పడ్డ నాలుగు డి ఏ లను వెంటనే మంజూరు చేయాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, ఉమ్మడి సర్వీస్ రూల్స్ పరిష్కరించి ,మున్సిపల్ జడ్పీ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని ,విద్యా రంగ పరిరక్షణలో బోధనేతర కార్యక్రమాలు అన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో ధర్మవరం జోన్ యూటీఎఫ్ నాయకులు ఆంజనేయులు, అమర్ నారాయణరెడ్డి, సకల చంద్రశేఖర్ ,పి సురేష్, హెచ్ రామాంజనేయులు ,పుల్లయ్య, శంకర్, రామకృష్ణారెడ్డి , లక్ష్మీనారాయణ , శివా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
The post సెప్టెంబర్ 25 వ తేదీన తలపెట్టిన రణభేరి భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి appeared first on Visalaandhra.
రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్రారెడ్డి పిలుపువిశాలాంధ్ర ధర్మవరం; రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు, సంబంధించిన విద్యారంగ సమస్యలు మరియు ఆర్థిక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్న డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 15 వ తేదీ నుండి 19 తేది వరకు రాష్ట్ర వ్యాప్తంగా యుటిఎఫ్ నిర్వహించిన రణభేరి కార్యక్రమం లో ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయడం జరిగిందని సెట్టిపి జయచంద్ర రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల
The post సెప్టెంబర్ 25 వ తేదీన తలపెట్టిన రణభేరి భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి appeared first on Visalaandhra.
