Chiranjeevi Fans: జాగ్రత్త.. మరోసారి నోరు జారితే.. బాలకృష్ణకు చిరంజీవి అభిమానుల వార్నింగ్
Chiranjeevi Fans: అసెంబ్లీ సమావేశాల్లో మెగాస్టార్ చిరంజీవి గురించి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బాలయ్యపై చిరంజీవి అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భవాని రవికుమార్ తీవ్రంగా స్పందించారు. ప్రత్యక్షంగా పరోక్షంగా మెగాస్టార్ చిరంజీవిని మేము దైవంగా భావిస్తామన్నారు. అలాంటి వ్యక్తి గురించి ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సమర్ధనీయం కాదన్నారు. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకూడదని మేము కోరుకుంటున్నామన్నారు. చిరంజీవిపై అసెంబ్లీలో…
