హైదరాబాద్: కాంగ్రెస్ అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని దుయ్యబట్టారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా షేక్ పేట ప్రాంతం సమతా నగర్ లో కెటిఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలకు నెలకు రూ.2,500 హామీ ఏమైందని ప్రశ్నించారు. దొంగమాటలు చెప్పి తప్పించుకుంటున్నారని, ప్రజలు మళ్లీ కెసిఆర్ నాయకత్వం కోరుకుంటున్నారన్నారు. ఫోర్త్ సిటీని కాదు ఉన్న సిటీని పట్టించుకోవాలని, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఫోర్త్ సిటీని రేవంత్ రెడ్డి తీసుకొచ్చారని కెటిఆర్ దుయ్యబట్టారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో మాగంటి సునీతను గెలిపించాలని ప్రజలను కోరారు. వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామని నోటికొచ్చిన వాగ్ధానాలు చేసి, అరచేతిలో వైకుంఠం చూపెట్టి, గద్దెనెక్కిన తర్వాత కాంగ్రెస్ నాయకులు తప్పించుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తుచేసేందుకు బాకీ కార్డులను ప్రజలకు అందజేస్తున్నామని కెటిఆర్ వివరించారు. ప్రతీ వర్గాన్ని వంచించిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలకు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల రూపంలో మంచి అవకాశం దొరికిందన్నారు.