తెలియదు.. గుర్తుకులేదు.. మర్చిపోయా.. పోలీసులకు ఐ బొమ్మ రవి సమాధానాలివీ

Immadi Ravi Ibomma

I Bomma Ravi: అదుర్స్ సినిమా చూశారా.. అందులో ఓ సన్నివేశంలో జూనియర్ ఎన్టీఆర్ తెలియదు.. గుర్తుకులేదు.. మర్చిపోయా.. అని సమాధానం చెబుతుంటాడు. అప్పట్లో ఆ సన్నివేశం చాలామందిని ఆకట్టుకుంది. ఇప్పటికీ మీమర్స్ ఆ వీడియోను వాడుకుంటారు. ఇక యూట్యూబ్ లో ఆ సన్నివేశానికి సంబంధించిన వీడియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.

ఇప్పుడు ఐ బొమ్మ రవి తెలంగాణ పోలీసులకు అదుర్స్ సినిమా చూపిస్తున్నాడు. చంచల్ గూడ జైల్లో ఐ బొమ్మ రవి విచారణ ఖైదీగా ఉన్నాడు. అతడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టడానికి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో అతడు పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేసినట్టు తెలుస్తోంది. అనేక ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెప్పినట్టు సమాచారం. బ్యాంకు ఖాతాల వివరాలపై రవి నోరు మెదపలేదు. యూజర్ ఐడి, పాస్ వర్డ్ లు అడిగితే గుర్తుకు లేదని, మర్చిపోయానని అతడు చెప్పినట్టు అధికారులు మీడియాకు లీకులు ఇచ్చారు.

రవి ఎంతసేపటికి స్పష్టమైన సమాధానం చెప్పకపోవడంతో పోలీసులు ఎథికల్ హ్యాకర్ల ద్వారా అతడి లాప్టాప్ లు, ఇతర డిజిటల్ పరికరాలను ఓపెన్ చేయించడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అవి ఓపెన్ అయితే చాలా వివరాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. రవిని అరెస్ట్ చేసిన తర్వాత అతడి ద్వారానే ఐ బొమ్మ నుంచి ఒక మెసేజ్ పాస్ చేశారు. ఇకపై ఐ బొమ్మలో సినిమాలు అందుబాటులో ఉండవని.. సైటు మూసి వేస్తున్నామని రవి ద్వారా ప్రకటన చేయించారు.

ఐ బొమ్మ సైట్ సేవలు నిలిచిపోయిన తర్వాత.. ఐ బొమ్మ1 పేరుతో ఒక సైట్ ఓపెన్ అయింది. ఈ సైట్ ఓపెన్ చేయగానే మూవీ రూల్స్ వైపు తీసుకెళ్తోంది. పోలీసుల విచారణలో ఐ బొమ్మకు అనుబంధంగా దాదాపు వందలాది మిర్రర్ సైట్లు ఉన్నాయని తెలుస్తోంది.. భవిష్యత్తు కాలంలో ఐ బొమ్మ సైట్ సేవలు నిలిచిపోతే.. మిర్రర్ సైట్ల ద్వారా సినిమాలను అందుబాటులో ఉంచేందుకు రవి ఈ ప్రయత్నం చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. విచారణలో పోలీసులు ఎన్ని ప్రశ్నలు అడిగినప్పటికీ రవి సమాధానాలు చెప్పకుండా దాటవేస్తున్నట్టు తెలుస్తోంది.

రవి వాడిన డిజిటల్ పరికరాలను ఎథికల్ హ్యాకర్స్ ద్వారా ఓపెన్ చేస్తే కీలకమైన సమాచారం బయటకు వస్తుందని పోలీసులు భావిస్తున్నారు.. అయితే ఆ డిజిటల్ పరికరాలలో కూడా పూర్తిస్థాయిలో సమాచారం ఉందని నమ్మడానికి లేదని పోలీసులు అంటున్నారు.. తనను అరెస్ట్ చేస్తారని రవి కి ఒక అంచనా ఉండడంవల్లే ఏ ఒక ఆధారం కూడా బయటకు రాకుండా జాగ్రత్త వహించాడని పోలీసులు చెబుతున్నారు.

​I Bomma Ravi: అదుర్స్ సినిమా చూశారా.. అందులో ఓ సన్నివేశంలో జూనియర్ ఎన్టీఆర్ తెలియదు.. గుర్తుకులేదు.. మర్చిపోయా.. అని సమాధానం చెబుతుంటాడు. అప్పట్లో ఆ సన్నివేశం చాలామందిని ఆకట్టుకుంది. ఇప్పటికీ మీమర్స్ ఆ వీడియోను వాడుకుంటారు. ఇక యూట్యూబ్ లో ఆ సన్నివేశానికి సంబంధించిన వీడియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఐ బొమ్మ రవి తెలంగాణ పోలీసులకు అదుర్స్ సినిమా చూపిస్తున్నాడు. చంచల్ గూడ జైల్లో ఐ బొమ్మ రవి విచారణ  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *