మూడు నెలల క్రితం వ్యక్తి మృతి.. ఆస్పత్రిలో ఆత్మ.. ఊరివాళ్లు ఏం చేశారంటే?

Madhya Pradesh

Madhya Pradesh: నేటి సాంకేతిక కాలంలో మనిషి చేయని పని అంటూ లేకుండా పోయింది. అంతరిక్షం నుంచి భూమి అంతర్భాగం వరకు మనిషి వెళ్లగలుగుతున్నాడు.. అసాధ్యమైన విషయాలను సైతం సుసాధ్యం చేస్తున్నాడు. సాంకేతిక పరిజ్ఞానం ఈ స్థాయిలో పెరిగిన నేపథ్యంలో ఆత్మలు, చేతబడులు ఉన్నాయంటే ఒకింత ఆశ్చర్య పోవాల్సిందే. మంత్రాలకు చింతకాయలు రాలవని తెలిసినప్పటికీ.. నేటికీ మంత్రాలు, చేతబడులు, ఆత్మలు అనేవి వాడుకలో ఉండడం విస్మయాన్ని కలిగిస్తూ ఉంటుంది.

ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలలో చేతబడులు కనిపించేవి. వీటివల్ల ఎటువంటి ప్రభావం ఉండకపోయినప్పటికీ.. చాలామంది అప్పట్లో నమ్మేవారు. అప్పట్లో చాలామందికి అక్షర జ్ఞానం లేకపోవడం వల్ల ఈ మూఢనమ్మకాలను విపరీతంగా విశ్వసించేవారు. కాలమారుతున్న కొద్ది మూఢనమ్మకాలను నమ్మడం చాలా వరకు తగ్గిపోయింది. అయితే సినిమాల ప్రభావం వల్ల కొంతమంది ఇటువంటి మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. సినిమాలలో ఇటీవల కాలంలో చేతబడి, దయ్యాల వంటి కధాంశాలు పెరిగిపోయాయి. ఆత్మలు ఉంటాయని.. అవి దాడులు కూడా చేస్తాయని.. కొంతమంది నేటికీ నమ్ముతుంటారు. కలలో తమకు వచ్చిన వారిని నిజమని భావిస్తూ ఎదుటివారిని కూడా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లమ్ పేరుతో ఒక మెడికల్ కాలేజ్ ఉంది. ఈ కాలేజీకి అనుబంధంగా హాస్పిటల్ ఉంది. సరిగ్గా మూడు నెలల క్రితం పురుగుల మందు తాగి శాంతి లాల్ అనే వ్యక్తి చనిపోయాడు.. అతడి ఆత్మ ఆసుపత్రిలో ఉందని బంధువులు డప్పులు కొట్టుకుంటూ, డ్యాన్సులు వేసుకుంటూ ఆసుపత్రికి వచ్చారు.. అంతేకాదు శాంతి లాల్ ఆత్మ ప్రతిరోజు తమకు కనిపిస్తోందని.. కలలో వచ్చి వేధిస్తోందని గిరిజనులు వాపోయారు. అతడి ఆత్మను ఇంటికి తీసుకెళ్లడానికి తాము ఆసుపత్రికి వచ్చామని పేర్కొన్నారు. అంతేకాదు ఆసుపత్రిలో తాంత్రిక పూజలు నిర్వహించారు. సుమారు గంటపాటు వారు పూజలు జరిపారు. ఆ తర్వాత తమ ఇంటికి వెళ్లిపోయారు.

ఆస్పత్రిలో ఇంతటి తతంగం జరుగుతున్నప్పటికీ మేనేజ్మెంట్ పట్టించుకోలేదు. పైగా దానిని వారి కుటుంబ వ్యవహారం లాగా భావించింది.”ఆసుపత్రికి గిరిజనులు వచ్చారు. వారు ఎందుకు వచ్చారనేదానిమీద మాకు క్లారిటీ లేదు. వారు ఏవో పూజలు చేసుకున్నారు. అటువైపు మేము వెళ్ళాలి అనుకోలేదు. పూజలు చేసుకుని ఇంటికి వెళ్ళిపోయారు.. ఆత్మ ఉందని.. అది వారిని ఇబ్బంది పెడుతోందని చెప్పారు. దానితో మాకు సంబంధం లేదు. అందువల్లే వారు పూజలు చేస్తుంటే చూస్తూ ఉండిపోయామని” ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

​Madhya Pradesh: నేటి సాంకేతిక కాలంలో మనిషి చేయని పని అంటూ లేకుండా పోయింది. అంతరిక్షం నుంచి భూమి అంతర్భాగం వరకు మనిషి వెళ్లగలుగుతున్నాడు.. అసాధ్యమైన విషయాలను సైతం సుసాధ్యం చేస్తున్నాడు. సాంకేతిక పరిజ్ఞానం ఈ స్థాయిలో పెరిగిన నేపథ్యంలో ఆత్మలు, చేతబడులు ఉన్నాయంటే ఒకింత ఆశ్చర్య పోవాల్సిందే. మంత్రాలకు చింతకాయలు రాలవని తెలిసినప్పటికీ.. నేటికీ మంత్రాలు, చేతబడులు, ఆత్మలు అనేవి వాడుకలో ఉండడం విస్మయాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలలో చేతబడులు కనిపించేవి. వీటివల్ల  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *