Headlines

ఫిబ్రవరి నుంచి లక్ష డాలర్ల ఫీజు

వాషింగ్టన్ : ఇటీవల లక్ష డాలర్ల వరకు కొత్త దరఖాస్తుదారులకు హెచ్1 బి ఫీజును పెంచుతున్నట్లు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం తాజాగా దాని అమలు తేదీని వెల్లడించింది. 2026 ఫిబ్రవరి నుంచి అమల్లోకి తీసుకువస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. అయితే దానికి ముందే ఆ వీసాల జారీలో గణనీయమైన మార్పులు ఉంటాయని వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ వెల్లడించారు. పాత విధానంలోని లోపాలకు స్వస్తి పలుకుతామని మంగవారంనాడు ఆయన వెల్లడించారు. హెచ్1 బి నూతన…

Read More

పాక్ ఖనిజాలపై ట్రంప్ కన్ను

వాషింగ్టన్ నుండి వచ్చిన చిత్రాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ సైనిక ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌లను కలిసిన దృశ్యాలను చూపించాయి. ఈ సమావేశంలో, మునీర్ ట్రంప్‌కు ‘అరుదైన భూమి ఖనిజాలు’ అని పిలవబడే పాలిష్ చేసిన ట్రేని బహూకరించారు. వారు వైట్ హౌస్‌ను ఆకట్టుకోవాలని, అమెరికా నుండి పెట్టుబడులు పొందాలని ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు. అరుదైన భూమిపై నియంత్రణ కోసం ప్రపంచం తీవ్రంగా పోటీ పడుతున్న సమయంలో…

Read More

Maharnavami: అక్టోబర్ 1.. మహర్నవమి.. పూజ ఇలా చేస్తే సకల శుభాలు కలుగుతాయి..!

Maharnavami: దేవీ నవరాత్రుల్లో అక్టోబర్ 1న మహర్నవమి. మరి ఈ రోజున పూజ ఏ విధంగా చేస్తే సకల శుభాలు చేకూరతాయో తెలుసుకుందాం. దేవీ నవరాత్రుల్లో అక్టోబర్ 1న బుధవారం మహర్నవమి వచ్చింది. దేవీ నవరాత్రులు అన్నీ ఒక ఎత్తైతే మహర్నవమి మరొక ఎత్తు. ఈ ఒక్క రోజు పూజ చేస్తే అన్ని రోజులు పూజ చేసిన విశేషమైన ఫలితం దక్కుతుంది. మహర్నవమి రోజున ఏం చేయాలి? ఈ రోజు ఏ చిన్న స్త్రోతం చదువుకున్న, ఏ…

Read More

స్థానిక ఎన్నికలు సీతక్కకు అగ్నిపరీక్షే

దిగ్గజ నేతలున్న నిజామాబాద్ జిల్లాలో ఇంచార్జి మంత్రిగా సీతక్క అగ్నిపరీక్షను ఎదుర్కోబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించడం అంతా సులువేమీ కాదు. సుమారు 4 నెలల క్రితం ఇంచార్జి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆమె పాలన, పార్టీ వ్యవహారాలలో ఇంకా క్రియాశీల పాత్రను పోషించలేకపోతున్నారు. తుఫాన్ విపత్తుల వేళ ఆమె యంత్రాంగాన్ని పరుగులు పెట్టించలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆమె స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని ఎలా…

Read More

స్వయం సమృద్ధ భారత్ సాధ్యమా?

స్వదేశీ వినియోగాన్ని, గిరాకీని పెంచి స్వయం సమృద్ధ భారత్‌ను నిర్మించాలని మన ఏలికలు నిర్దేశించుకోవడం సముచితమే. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన ఎగుమతులపై 50 శాతం, మందులు, ఔషధాలపై నూరు శాతం దిగుమతి సుంకాలు విధించడమే గాక మన సినిమాలపై కూడా ఆంక్షలు విధించి భారత్‌ను ఆర్థికంగా దెబ్బ తీయడానికి కక్షపూరితంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో దేశప్రయోజనాల పరిరక్షణకు జాగ్రత్తగా వ్యవహరించడం అవసరమే. స్వయం సమృద్ధ భారత్ లక్ష్యాలను సాధించాలంటే వివిధ రంగాలలో ముఖ్యంగా దేశసరిహద్దులను…

Read More

5వ తేదీలోగా అభ్యర్థుల జాబితా

మన తెలంగాణ/హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలను ఆషామాషీగా తీసుకోరాదని, ప్రతిష్టాత్మకంగా తీసుకుని మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించారు. పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితా సిద్ధం చేయడంతోనే సరిపోదని వారిని గెలిపించే బాధ్యతనూ తీసుకోవాలని అన్నారు. మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసం నుంచి మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం…

Read More

ధాన్యం సేకరణకు భారీ లక్ష్యం

మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ ఖరీఫ్ సీజన్‌లో అత్యధికం గా ధాన్యం సేకరణకు సిద్ధమవుతున్నాయని, సేకరణ లక్ష్యాల ను అత్యవసరంగా సవరించాలని, డెలివరీ నిబంధనలను సడలించాలని, అదనపు నిల్వ, రవాణా సౌకర్యాలను కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చే శారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యం గా ఉందని, ఇది తెలంగాణ చరిత్రలో అప్పటి వరకు లేదని దేశంలోని ఏ రాష్ట్రంలో…

Read More

మంత్రి సీతక్కను క‌లిసిన‌ పి.జోగారెడ్డి

పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన పి. జోగారెడ్డి ప్రజాభవన్‌లో మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క జోగారెడ్డిని అభినందించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలం చందుపట్ల గ్రామానికి చెందిన పి.జోగారెడ్డి పంచాయతీరాజ్‌ విభాగంలో 1989లో ఏఈగా చేరి ఈ స్థాయికి ఎదిగారు. The post మంత్రి సీతక్కను క‌లిసిన‌ పి.జోగారెడ్డి appeared first on Navatelangana. ​పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన…

Read More

కాంగ్రెస్‌ పాలనలోనే గ్రూప్‌-1 నియామకాలు

పదేండ్లలో నిరుద్యోగులను నిండా ముంచారు : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌అప్పుడూ..ఇప్పుడూ.. కాంగ్రెస్‌ పాలనలోనే గ్రూప్‌-1 నియామకాలు జరిగాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గ్రూప్‌ వన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ శాఖలో జిల్లా రిజిస్ట్రార్‌లుగా నియమితులైన పలువురు అభ్యర్థులు మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ ఆంబేద్కర్‌ సచివాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ నిరుద్యోగులను బీఆర్‌ఎస్‌…

Read More

త్వరితగతిన గాంధీ జయంతి ఏర్పాట్లు

హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ హరిచందన దాసరిబాపు ఘాట్‌, మ్యూజియం హాల్‌ పరిశీలనబయోమెట్రిక్‌ హాజరు విధానం ప్రారంభం నవతెలంగాణ-సిటీబ్యూరోగాంధీ జయంతి నేపథ్యంలో చేపట్టిన పనుల్లో వేగం పెంచి పూర్తి చేయాలని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ హరిచందన దాసరి సంబంధిత అధికారులను ఆదేశించారు. బాపు ఘాట్‌లోని పలు ప్రాంతాలను మంగళవారం ఆమె పరిశీలించారు. అనంతరం బాపూ మ్యూజియం హాల్‌లో ఏర్పాట్లపై చేపట్టిన సమావేశంలో అదనపు కలెక్టర్‌ జి.ముకుంద రెడ్డితో కలిసి ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. శాఖల…

Read More