శ్రీసూర్య దృష్టి, పార్వతీపురం-మన్యం : పార్వతీపురం పట్టణం చర్చి వీధిలోని వేదాంత ఐఐటి- నీట్ అకాడమీ జూనియర్ కళాశాల విద్యార్ధులు ఐపీఈ-2026 ఫలితాల్లో ప్రతిభ చాటుకున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపిసి విభాగంలో యందమూరి అక్షయ 1000 మార్కులకు గాను 981 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్ గా నిలిచింది. ప్రథమ సంవత్సరం బైపిసి విభాగంలో కర్రి సాధన 455 మార్కులకు గాను 447 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్ గా నిలిచింది. ప్రథమ సంవత్సరం ఎంపిసి విభాగంలో మహమ్మద్ ముబారక్ 470 మార్కులకు గాను 462 మార్కులు సాధించి టాపర్ గా నిలవగా, ద్వితీయ సంవత్సరం ఎంపిసి విభాగంలో ఆర్. జస్వంత్ కుమార్ 1000 మార్కులకు గాను 982 మార్కులు సాధించాడు. కళాశాలకు చెందిన విద్యార్ధులలో 400 పైగా మార్కులు సాధించినవారు మొత్తం 65 మంది ఉన్నారని, విద్యార్ధుల విజయానికి అధ్యాపకుల కృషి, తల్లిదండ్రుల సహకారమే కారణమని కళాశాల కరస్పాండెంట్ పి. అప్పావరావు పేర్కొన్నారు.
ఇంటర్ ఫలితాలలో “వేదాంత కళాశాల” ప్రభంజనం
ఇంటర్ ఫలితాలలో “వేదాంత కళాశాల” ప్రభంజనం
