జిల్లా విద్యా శిక్షణ సంస్థ విజయనగరంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 12 వ తేదీ వరకు రెండవ స్పెల్స్ గా టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమం జరిగింది. ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ దత్తి అప్పలనాయుడు మాట్లాడుతూ ఎస్ సి ఇ ఆర్ టి డైరెక్టర్ వారి ఆదేశానుసారం DIET ఫ్యాకల్టీ పాఠశాలల సందర్శన సమయంలో పరిశీలించాల్సిన అంశాల గురించి శిక్షణ ఉద్దేశ్యం అన్నారు. టీచ్ టూల్ రిసోర్స్ పర్సన్స్ రమేష్ బాబు & పద్మజ గారు మాట్లాడుతూ తరగతిగది పరిసరాలు, సమదృష్టితో బోధన విధానం, విద్యార్థుల సానుకూల ప్రవర్తన,అవగాహన, విశ్లేషణాత్మక ఆలోచన, సహచర విద్యార్థుల పరస్పర నైపుణ్య మార్పిడి, అంశాల వారి ప్రతిస్పందన దృష్టిలో ఉంచుకుని ప్రధానంగా పాఠశాలల సందర్శన సమయంలో పరిశీలించాలని IF ప్యానల్ లో ఉదాహరణ సహిత వీడియోలతో శిక్షణలో వివరించారు. ఈ శిక్షణలో డైట్ ఫ్యాకల్టీ అందరూ శ్రద్ధగా పాల్గొని లోతుగా అధ్యయనం చేసినందుకు, అందరూ ఉత్తీర్ణులైనందుకు అభినందించారు. కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ వాక చిన్నంనాయుడు, ఫ్యాకల్టీ రమేష్, మురళి, సూరిబాబు, శ్రీనివాసరావు, అన్నారావు, అప్పారావు, లక్ష్మణరావు, సత్యారావు, రజిత, సౌమ్య, సూర్యకళ, శర్మ, సోమయాజులు, శశి భూషణ్, గోపాలకృష్ణ, ఉమా మహేష్ పాల్గొన్నారు.
రెండు స్పెల్స్ గా టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమం : డైట్ విజయనగరం
రెండు స్పెల్స్ గా టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమం : డైట్ విజయనగరం


