
Karimangar : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కోతుల బెడద సమస్యగా మారింది. చాలా గ్రామాల్లో కోతుల సంఖ్య విపరీతంగా పెరగడంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడ చూసినా కోతుల సంచారం కనిపిస్తుండగా, కొందరిపై దాడులు జరగడం కూడా భయాందోళనకు గురిచేస్తోంది. పరిస్థితి ఏ స్థాయిలో ఉందంటే.. గ్రామాల్లో మనుషుల కంటే కోతులే ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తోంది. దీంతో ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారు. స్థానికులు పలుమార్లు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదే సమయంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో, రాజకీయ నేతలు ప్రచార యాత్రల్లో బిజీగా మారారు. అభ్యర్థుల ప్రకటనల ముందే ఆశావాహులు ఇంటింటికీ తిరుగుతూ మద్దతు కోరుతున్నారు.
Mumbai: బ్లింకిట్ బాయ్ దుశ్చర్య.. డెలివరీ చేస్తూ మహిళను ఏం చేశాడంటే..!
అయితే ప్రతి ఇంట్లోనూ ప్రజలు ఒకటే సమస్యను ముందుకు తెస్తున్నారు.. “మా ఊర్లో కోతుల సమస్యను తొలగిస్తేనే ఓటు వేస్తాం” అని స్పష్టం చేస్తున్నారు. దీంతో నేతలు కూడా ప్రజల డిమాండ్ దృష్ట్యా కోతుల సమస్య పరిష్కారంపై హామీ ఇస్తున్నారు. మొత్తానికి, కరీంనగర్ జిల్లాలో ఈసారి ఎన్నికల అజెండాలో కోతుల సమస్య కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. అభ్యర్థులు గెలిస్తే మొదటగా ఈ సమస్యను పరిష్కరిస్తామంటూ భరోసా ఇస్తున్నారు.
Suryakumar Yadav Regret: నా కోరిక ఎప్పటికీ నెరవేరదు.. తీవ్రంగా చింతిస్తుంటా!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కోతుల బెడద సమస్యగా మారింది. చాలా గ్రామాల్లో కోతుల సంఖ్య విపరీతంగా పెరగడంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
