Headlines

చేపల స్టోరేజ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తాం

చెరువుల వద్ద సైన్‌ బోర్డులు : మంత్రి వాకిటి శ్రీహరిహుస్నాబాద్‌ అభివృద్ధికి కృషి : మంత్రి పొన్నం ప్రభాకర్‌ఎల్లమ్మ చెరువులో 3 లక్షల చేప పిల్లలు విడుదల నవతెలంగాణ-హుస్నాబాద్‌హుస్నాబాద్‌లో మత్స్య సంపద అభివృద్ధి చెందేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చేపల మార్కెట్‌లో స్టోరేజ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మత్స్య, పశుసంవర్ధక శాఖమంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఎల్లమ్మ చెరువులో రూ.5.17 లక్షల విలువ చేసే మూడు లక్షల చేపపిల్లలను మంత్రి…

Read More

ప్రొఫెసర్‌ తిరుపతిరావు కమిటీ రిపోర్టు ఏమైంది?

తక్షణమే వివరాలు వెల్లడించాలిఓయూ పదోన్నతుల అవకతవకల నివేదిక బహిర్గతం చేయాలి : ఏఐఎస్‌ఎఫ్‌ డిమాండ్‌ నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ఓయూ సీనియర్‌ ప్రొఫెసర్‌ అక్రమాలపై నియమించిన ప్రొఫెసర్‌ తిరుపతిరావు కమిటీ రిపోర్టుని బహిర్గత పరచాలని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కౌన్సిల్‌ చైర్మెన్‌ ప్రొఫెసర్‌ వి. బాలకిష్టారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. కొంతమంది ప్రొఫెసర్లకు ప్రమోషన్లలో జరిగిన అన్యాయంపై గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు….

Read More

సాంకేతిక వైద్య శస్త్రచికిత్సలపై అవగాహన అవసరం

నిమ్స్‌ డైరెక్టర్‌ బీరప్పఎమర్జెన్సీ భవనంలో వర్క్‌షాప్‌ నవ తెలంగాణ – బంజారాహిల్స్‌న్యూరో-స్పైనల్‌ శస్త్రచికిత్స రంగంలో ఆధునిక సాంకేతిక పద్ధతులపై వైద్యులకు అవగాహన ఉండటం అత్యంత కీలకమని నిమ్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ నగరి బీరప్ప అన్నారు. నిమ్స్‌, అసోసియేషన్‌ ఫర్‌ న్యూరో-స్పైనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సంయుక్తంగా శనివారం హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఎమర్జెన్సీ భవనంలోని ట్రామా ఆడిటోరియంలో ”యూనిలాటరల్‌ బయో పోర్టల్‌ స్పైనల్‌ ఎండోస్కోపీకోర్స్‌ -క్యాడేవరిక్‌ వర్క్‌షాప్‌ అండ్‌ సర్జికల్‌ ప్రిసెప్టర్‌షిప్‌” కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి నిమ్స్‌ సర్జన్‌…

Read More

దాడులు చేస్తే సహించం

గర్వంతో విర్రవీగితే కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధిచెప్తారు : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌బీఆర్‌ఎస్‌ కార్యకర్త రాకేశ్‌ క్రిస్టోఫర్‌కు పరామర్శ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు గడవకముందే బీఆర్‌ఎస్‌ కార్యకర్త రాకేశ్‌పై కాంగ్రెస్‌ గూండాలు దాడి చేయడాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) ఖండించారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించబోమని హెచ్చరించారు. అధికారం, విజయగర్వంతో విర్రవీగితే కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధిచెప్తారని అన్నారు….

Read More

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

పలువురికి గాయాలునవతెలంగాణ-మానకొండూర్‌ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో పలువురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. శనివారం కరంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలంలోని సదాశివపల్లి బస్టాప్‌ సమీపంలో నిజామాబాద్‌ నుంచి వరంగల్‌ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 12 మందికి గాయాలయ్యాయి. బస్సు అద్దాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు…

Read More

కాంగ్రెస్‌కు బలముంటే అజారుద్దీన్‌కు టికెట్‌ ఎందుకివ్వలేదు?

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి బలముంటే మంత్రి అజారుద్దీన్‌కు టికెట్‌ ఎందుకివ్వలేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు సంబంధించి చాలా సర్వేల్లో రేవంత్‌రెడ్డి కంటే నవీన్‌ యాదవ్‌కు ప్రాబల్యం ఎక్కువ అని తేలిందన్నారు. కానీ రేవంత్‌రెడ్డి గెలిచినట్టు ప్రజలను మభ్య పెడుతున్నారని అన్నారు. అధికార దుర్వినియోగం వల్లే కాంగ్రెస్‌ గెలిచిందని చెప్పారు….

Read More

ఎస్‌హెచ్‌జీలతో రాష్ట్ర ఆర్థిక పునరుజ్జీవనం

గ్రామీణ మహిళల ఉత్పత్తులకు గ్లోబల్‌ మార్కెటింగ్‌ సౌకర్యం : మండల సమాఖ్య అధ్యక్షుల రాష్ట్రస్థాయి సదస్సులో మంత్రి సీతక్క నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌”స్వయం సహాయక బృందాల రూపంలో సగటు స్త్రీ అస్తిత్వం మరింత శక్తివంతమవుతోంది. ఎస్‌హెచ్‌జీల భాగస్వామ్యంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. గ్రామీణ మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్‌ అవకాశాలు కల్పిస్తూ, వారిని గ్లోబల్‌ మార్కెట్‌ వైపు తీసుకెళ్తున్నాం” అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో మండల సమాఖ్య…

Read More

రాష్ట్రం ఏరో ఇంజిన్ హబ్

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణను 2030 నాటికి దేశ ‘ఏరో ఇంజిన్ రాజధాని’గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ ధర్ బాబు అన్నారు. ఇందుకోసం ప్రపంచంతో పోటీపడేలా దిగ్గజ పరిశ్రమలు, ప్రముఖ విద్యాసంస్థల భాగస్వామ్యంతో ‘ఏరోస్పేస్, డిఫెన్స్ ఎకోసిస్టమ్’ను రాష్ట్రంలో అభివృద్ధి చేసేందుకు రోడ్డు మ్యాప్‌ను రూపొందిస్తున్నామన్నారు. ‘ఎండ్ టూ ఎండ్ ఎకోసిస్టం’ కోసం గత కాంగ్రె స్ ప్రభుత్వాలు వేసిన పునాదులే ప్రస్తుతం తెలంగాణను దేశ స్ట్రాటెజిక్…

Read More

వినియోగదారుల ఒత్తిడికి తలొగ్గిన ట్రంప్‌

పలు వస్తువులపై సుంకాలు తగ్గింపువాషింగ్టన్‌ : అధిక ధరల విషయంలో వినియోగదారుల ఒత్తిడికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తలొగ్గారు. ఆవు మాంసం, కాఫీ, ఉష్ణమండలాల్లో పెరిగే పండ్లు సహా విస్తృత శ్రేణి వస్తువులపై సుంకాలను తొలగించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై శుక్రవారం ఆయన సంతకం చేశారు. ఆవు మాంసం ప్రధాన ఎగుమతిదారుగా బ్రెజిల్‌ ఉన్నది. అయితే బ్రెజిల్‌పై భారీ సుంకాలు విధించడంతో ఆవుమాంసం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. దీంతో దాని ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని…

Read More

పాక్‌లో ముదిరిన న్యాయ సంక్షోభం

సుప్రీం న్యాయమూర్తుల బాటలోనే లాహోర్‌ హైకోర్టు జడ్జి రాజీనామాలాహోర్‌ : పాకిస్తాన్‌లో శనివారం జ్యుడిషియల్‌ సంక్షోభం మరింత ముదిరింది. దేశ రాజ్యాంగానికి నూతనంగా తీసుకువచ్చిన సవరణ ద్వారా రాజ్యాంగంపై, న్యాయవ్యవస్థపై దాడి చేయడాన్ని నిరసిస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇద్దరు రాజీనామా చేయగా, తాజాగా లాహోర్‌ హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి షామ్స్‌ మెహమూద్‌ మీర్జా శనివారం రిజైన్‌ చేశారు. దీంతో వివాదాస్పదమైన సవరణ.. చట్టంగా మారిన తర్వాత హైకోర్టుకు రాజీనామా చేసిన తొలి న్యాయమూర్తి మీర్జా అయ్యారు….

Read More