అమరావతే గ్రోత్ ఇంజన్
రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సహకరించండిరాజధానిగా గుర్తించాలని కేంద్రాన్ని కోరతాం : రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి: అమరావతే రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్‌గా ఉండాలని, రాజధాని అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. సచివాలయంలో రాజధాని రైతులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని రైతులకు న్యాయం చేయడం తన బాధ్యత అని అన్నారు. ఇక్కడ జరిగిన అభివృద్ధి ఫలాలను రాజధాని రైతులే ముందు అందుకోవాలని చెప్పారు. రాజధానిలో రెండో విడత ల్యాండ్ పూలింగులో భూములు…
