Headlines

Nirmala Sitharaman : రూపాయి పతనం వేళ నిర్మలా సీతారామన్ కీలక కామెంట్స్..

Nirmala Sitharaman

Nirmala Sitharaman : అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయి కనిష్టానికి పడిపోయిన విషయం తెలిసిందే. డాలర్ తో రూపాయి మారకం విలువ ప్రస్తుతం 89.95గా ఉంది. రెండు రోజుల క్రితం ఈ విలువ 90కి చేరింది. సమీప భవిష్యత్తులో ఈ మారకం విలువ రూ.91కి చేరుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సదస్సులో ఆమె మాట్లాడుతూ.. రూపాయి పతనం పై మాట్లాడారు.

రూపాయి విలువ పెరిగేందుకు ప్రభుత్వం తరపున లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున ప్రత్యేకంగా ఎలాంటి లక్ష్యాలను నిర్దేశించలేదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రూపాయి విలువను కృత్రిమంగా నియంత్రించడానికి ప్రయత్నించడం సరికాదు.. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడే డిమాండ్, సరఫరా ఆధారంగానే సరైన విలువ దొరుకుతుందని ఆమె పేర్కొన్నారు. ఇదే క్రమంలో రూపాయి పతనం పూర్తిగా ప్రతికూలమేమీ కాదని వెల్లడించారు. ఈ పరిస్థితులు ఎగుమతిదారులకు ప్రయోజనకరమేనని వెల్లడించారు.

రూపాయి విలువలో అధిక హెచ్చుతగ్గులు ఏర్పడి దేశ ఆర్థిక స్థిరత్వానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నప్పుడు, మార్కెట్‌ను స్థిరీకరించేందుకు మాత్రమే ఆర్‌బీఐ రంగంలోకి దిగుతుందని నిర్మలా సీతారామన్ వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆర్థిక వ్యవస్థలు ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లతో పోరాడుతున్నాయని, ఈ సమయంలో అన్ని దేశాల కరెన్సీలపైనా ఒత్తిడి ఉందని ఆమె చెప్పారు.

ఈ గ్లోబల్ అనిశ్చితి భారత రూపాయిపై కూడా ప్రభావం చూపుతున్నప్పటికీ.. ఇతర అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలతో పోలిస్తే భారత రూపాయి మెరుగ్గా, స్థిరంగా ఉందని నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు.

​Nirmala Sitharaman : అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయి కనిష్టానికి పడిపోయిన విషయం తెలిసిందే. డాలర్ తో రూపాయి మారకం విలువ ప్రస్తుతం  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *