Headlines

AP Cabinet Decisions: అందరికీ ఆరోగ్య బీమా.. 25 లక్షల వరకు ఫ్రీ ట్రీట్‌మెంట్.. ఇంకా.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

AP Cabinet

AP Cabinet Decisions: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఆయుష్మాన్ భారత్- ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద రాష్ట్రంలో పౌరులందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాదిలో ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందేలా కొత్త విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

పేద, ధనిక అనే తేడా లేకుండా..

ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ పాలసీ అమలయ్యేలా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ విధానం ద్వారా రాష్ట్రంలోని 1.63 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమాను అందించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించనుంది. 2వేల 493 నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు పొందేలా ఎన్టీఆర్ వైద్య సేవ హైబ్రిడ్ విధానం అమలు చేయనుంది.

మొత్తం 3వేల 257 చికిత్సలను హైబ్రిడ్ విధానంలో ఉచితంగా అందించనుంది ప్రభుత్వం. కేవలం 6 గంటల్లోనే వైద్య చికిత్సలకు అనుమతులు ఇచ్చేలా ప్రీ ఆథరైజేషన్ మేనేజ్ మెంట్ తీసుకురానుంది. రూ.2.5 లక్షల లోపు వైద్య చికిత్సల క్లెయిమ్స్ ఇన్సూరెన్స్ కంపెనీల పరిధిలోకి వచ్చేలా కొత్త విధానం
తీసుకురానుంది. రూ..2.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకకు వ్యయాన్ని ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ భరించనుంది.

1.43 కోట్ల మంది పేద కుటుంబాలకు ప్రయోజనం కలిగేలా..

1.43 కోట్ల మంది పేద కుటుంబాలు, 20 లక్షల మంది ఇతర కుటుంబాలకు వర్తించేలా ఎన్టీఆర్ వైద్య సేవ హైబ్రిడ్ విధానం అమలు చేయనుంది. కొత్త వైద్య కళాశాలల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది క్యాబినెట్. పీపీపీ విధానంలో రాష్ట్రంలో 10 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆమోదాన్ని తెలిపింది.

రెండు దశల్లో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలో పీపీపీ పద్దతిలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆర్ఎఫ్‌పీ జారీ చేసేందుకు అనుమతి ఇచ్చింది రాష్ట్ర మంత్రివర్గం. రెండో దశలో మిగిలిన ఆరు ప్రాంతాల్లోని వైద్య కళాశాలలను పీపీపీ కింద ఏర్పాటు చేసేందుకు ఫీజిబిలిటీ రిపోర్ట్ సిద్ధం చేయాలని నిర్ణయించింది.

Also Read: ఏపీలో మరో ఎన్నికల సమరం.. ఈ సారి ముందుగానే..!

​ప్రజల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. వైద్య చికిత్సలు భారంగా మారకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *