Headlines

పంచాయతీ కార్యదర్శులకు రూ.104కోట్లు

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శుల కోసం ఒకేసారి భారీ మొత్తంలో నిధులను విడుదల చేసింది. పం చాయతీ కార్యదర్శుల బిల్లుల క్లియరెన్స్ కోసం ప్రభుత్వం రూ.104 కోట్లు విడుదల చేసింది. దీంతో పం చాయతీ కార్యదర్శుల పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ అయ్యాయి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీత క్క చొరవతో ఎప్పుడూ లేని విధంగా ఒకే విడతలో ఇంత పెద్ద మొత్తాన్ని విడుదల చేసింది. ఈ నిధుల విడుదలతో పంచాయతీ కార్యదర్శులపై ఉన్న ఒత్తిడి తగ్గి ఊరట లభించింది. ఈ సందర్భంగా పంచాయతీరాజ్, 

గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ -పంచాయతీ కార్యదర్శుల సమస్యలు అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెంటనే స్పందించి రూ.104 కోట్లు విడుదల చేశారని అన్నారు. ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి ఇంత పెద్ద మొత్తాన్ని విడుదల చేయడం పంచాయతీ వ్యవస్థ పటిష్టతకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలకు కృతజ్ఞతలు తెలిపారు. 

​పంచాయతీ కార్యదర్శుల సమస్యలు అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెంటనే స్పందించి రూ.104 కోట్లు విడుదల చేశారని  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *