Headlines

Karthika Masam Deepam: కార్తీక మాసంలో వీటితో దీపం ఇలా వెలిగిస్తే.. అద్భుత ఫలితాలు కలుగుతాయి..!

Karthika Masam Deepam: కార్తీక మాసంలో దీపం ఎలా వెలిగించాలి? దీపం ఎప్పుడు వెలిగించాలి? దీపం ఎప్పుడు ఎలా వెలిగిస్తే కార్తీక మాసంలో అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.. కార్తీక మాసం అంటేనే దీపాలు వెలిగించేటటువంటి మాసం. కార్తీక మాసంలో దీపం ఎలా వెలిగించాలి అంటే.. ప్రధానంగా ఆవు నెయ్యి, నువ్వుల నూనె, అవిసె నూనె.. ఈ మూడింటితో దీపాలు వెలిగిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసంలో చాలా మంది రకరకాల నూనెలతో దీపాలు వెలిగిస్తుంటారు….

Read More

రాయితీలు కాదు.. రాజ్యాధికారం కావాలి

బీసీ రిజర్వేషన్లపై ప్రజా ఉద్యమాలతో కేంద్రం మెడలు వంచాలి : హిస్సా ఇజ్జత్‌ హుకుమాత్‌ పుస్తకావిష్కరణలో రిటైర్డ్‌ ఐఏఎస్‌ చిరంజీవులు నవతెలంగాణ- మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి‘రాయితీలు మాకొద్దు… రాజ్యాధికారం కావాలి. అందుకోసం రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా ఆందోళనలు చేపట్టాలి. ప్రజా ఉద్యమాలను నిర్మించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలి. పోరాటాల ద్వారానే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు వస్తాయి’ అని హిస్సా ఇజ్జత్‌ హుకుమాత్‌ పుస్తక రచయిత రిటైర్డ్‌ ఐఏఎస్‌ చిరంజీవివులు…

Read More

21న పోలీసు అమరవీరుల సభ

గోషామహల్‌ స్టేడియంలో సాయుధ బలగాల పరేడ్‌ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిఈ నెల 31 వరకు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు : డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడి నవతెలంగాణ- ప్రత్యేక ప్రతినిధివిధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల సంస్మరణార్థం ఈ నెల 21న హైదరాబాద్‌లోని గోషామహల్‌ స్టేడియంలో గల పోలీసు అమరవీరుల స్తూపం వద్ద సాయుధ బలగాల పరేడ్‌, సభ ఉంటాయనీ, ఆ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి హాజరవుతారని రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడించారు….

Read More

ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య

వెల్దుర్తిలో ఘటననవతెలంగాణ -వెల్దుర్తిఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెల్దుర్తిలో చోటుచేసుకుంది. ఆదివారం వెల్దుర్తి ఎస్‌ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన నాగరాజు (28) చేసిన అప్పులు తీర్చడం కోసం మరోచోట అప్పుచేసి టాటా ఏసీ కొనుగోలు చేసి కిరాయిలకు తిప్పుతున్నాడు. వ్యవసాయం కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలో చేసిన అప్పులు తీర్చలేక అప్పుడప్పుడు ఇంట్లో గొడవలు జరుగుతుండేవని అన్నారు. అప్పులు ఇచ్చినవారు ఇంటికి వస్తూ ఉండడంతో మనస్థాపానికి గురై ఆదివారం…

Read More

పోలీసుల అదుపులో రియాజ్‌

కానిస్టేబుల్‌ను హత్య చేసిన దుండగుడి అరెస్టుఎన్‌కౌంటర్‌ అంటూ పుకార్లు.. : కొట్టిపారేసిన సీపీ నవతెలంగాణ-కంఠేశ్వర్‌నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ఈ నెల 17న(శుక్రవారం) సీసీఎస్‌ కానిస్టేబుల్‌ ప్రమోద్‌ను కత్తితో పొడిచి హత్య చేసిన నిందితుడు రియాజ్‌ను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని 6వ టౌన్‌ పరిధిలో ఆసీఫ్‌ అనే వ్యక్తిపై సైతం రియాజ్‌ దాడి చేయగా.. అక్కడ పెనుగులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఇద్దరికి గాయాలు అయ్యాయి. స్పందించిన పోలీసులు రియాజ్‌ను అదుపులోకి తీసుకొని ఆస్పత్రికి తరలించారు….

Read More

తల్లిని కడ తేర్చిన కొడుకులు, మనవళ్లు

రైతుబంధు పింఛన్‌ డబ్బులే హత్యకు కారణం నవతెలంగాణ-వట్‌పల్లివృద్ధాప్యంలో భర్త మరణించిన అనంతరం సంరక్షించవలసిన కొడుకులు, మనవళ్లు కన్నతల్లి పట్ల కర్కశంగా వ్యవహరించారు. రైతుబంధు, పింఛన్‌ డబ్బుల కోసం 80 ఏండ్ల వృద్ధ తల్లిని హత్య చేశారు. ఈ సంఘటన వట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మార్వేల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. జోగిపేట సీఐ అనిల్‌ కూమార్‌ వివరాలను వెల్లడించారు. మార్వెల్లి గ్రామానికి చెందిన చాకలి బసమ్మ (80)ను జులై నెల మూడున కొడుకులు, మనవళ్లు కలిసి…

Read More

ఆర్థిక ఇబ్బందులతో స్వర్ణకారుడు ఆత్మహత్య

పెరిగిన బంగారం ధరలతో పనిలేదని మనస్థాపంనవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధిఆకాశానికి పరుగు పెడుతున్న బంగారం ఓ స్వర్ణకారుడి మెడకు ఉరి తాడైంది. రోజు రోజుకు బంగారం ధరలు పెరుగుతుండటం, మరోవైపు బంగారు కొనుగోళ్లులేకపోవడంతో చేసేందుకు పనిలేక, ఆర్థిక ఇబ్బందులు తాళలేక స్వర్ణకారుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు మెదక్‌ పట్టణం పెద్ద బజార్‌ కు చెందిన స్వర్ణకారుడు నరేష్‌ చారి(40) గోల్డ్‌ వర్క్‌ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు….

Read More

యాదవులకు సముచిత స్థానం

మరిన్ని రాజకీయ అవకాశాలు కల్పిస్తాం : సీఎం రేవంత్‌ రెడ్డి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ ప్రాతినిథ్యంలో యాదవులకు సముచిత స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో శ్రీకృష్ణ సదర్‌ సమ్మేళనాన్ని హర్యానా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తదితరులతో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సీఎంకు డప్పు చప్పుళ్లతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌…

Read More

ఘనంగా ఎం.వి.రఘు గోల్డెన్‌ జూబ్లీ సెలెబ్రేషన్స్‌

లెజెండరీ సినిమాటోగ్రాఫర్‌, డైరెక్టర్‌ ఎంవీ రఘు భారతీయ సినిమా పరిశ్రమలో 50 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రస్థాన గోల్డెన్‌ జూబ్లీ సెలబ్రేషన్స్‌ ఈవెంట్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఘనంగా నిర్వహించారు. పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంవీ రఘు చిత్ర పరిశ్రమకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. 1974లో కెరీర్‌ మొదలుపెట్టిన ఎంవీ రఘు, ‘కళ్లు’ రఘుగా గుర్తింపు పొందారు. ఆయన సినిమాటోగ్రాఫర్‌గా చేసిన ‘స్వాతిముత్యం, సిరివెన్నెల, సితార,…

Read More

థ్రిల్‌ చేసే ‘ది బ్లాక్‌ గోల్డ్‌’

కథానాయిక సంయుక్త తొలిసారి ఓ ఫిమేల్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌లో నటిస్తున్నారు. యోగేష్‌ కెఎంసి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంటెన్స్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి విజయ వంతమైన చిత్రాలు అందించిన నిర్మాత రాజేష్‌ దండా నిర్మిస్తున్నారు. హాస్య మూవీస్‌, మాగంటి పిక్చర్స్‌తో కలిసి చేస్తున్న ఆరవ సినిమా ఇది. సంయుక్త స్వయంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సింధు మాగంటి సహ నిర్మాత. ఆదివారం మేకర్స్‌ ఈ సినిమా టైటిల్‌ని అనౌన్స్‌…

Read More