Headlines

లేబర్‌ కోడ్‌ల రద్దుకు పోరాడాలి

మోడీ ప్రజ్యావతిరేక విధానాలను తిప్పికొట్టాలి :సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌వి. రమ
సీఐటీయూ రాజన్న సిరిసిల్ల జిల్లా మహాసభ ప్రారంభం

నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి / రాజన్నసిరిసిల్ల
కార్మికుల హక్కులను హరించే నాలుగు లేబర్‌ కోడ్‌ల రద్దు కోసం రైతు ఉద్యమ స్ఫూర్తితో యావత్‌ కార్మిక లోకం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌వి.రమ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం సీఐటీయూ జిల్లా నాలుగో మహాసభ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా కూరపాటి రమేష్‌ ప్రసంగించారు. బీజేపీ-మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై మరింత ఉధృతంగా పోరాటాలు చేయాలన్నారు. కార్మికులు తమ హక్కుల కోసం యూనియన్లు పెట్టుకుని పోరాడే హక్కును తొలగించేందుకు ప్రయత్నిస్తూ, యజమానులకు అవకాశం కల్పిస్తూ నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకొచ్చిందని విమర్శించారు. ఇది కార్మికుల శ్రమను దోచుకోవడమే అన్నారు. సింగరేణి, ఎల్‌ఐసీ, గనులు, బీఎస్‌ఎన్‌ఎల్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ శక్తులకు అప్పగించి ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా కార్మిక వ్యతిరేక విధానాలనే అనుసరిస్తోందని విమర్శించారు. మహాసభలో భవిష్యత్‌ ఉద్యమాలకు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. లేబర్‌ కోడ్‌ల పేరుతో సమ్మె హక్కు, యూనియన్‌ పెట్టుకునే హక్కులను తొలగిస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ.రమ అన్నారు. రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక జీవోలను తీసుకొస్తూ, కార్మిక ఉద్యమాలను అణచివేసే ధోరణిలో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ మహాసభలో సీఐటీయూ పవర్‌లూమ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు ముషం రమేష్‌, జనవిజ్ఞాన వేదిక ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యవస్థాపకులు సి.రామరాజు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షకార్యదర్శులు బాబు, నర్సయ్య, ఐద్యా జిల్లా కార్యదర్శి విమల తదితరులు పాల్గొన్నారు.

The post లేబర్‌ కోడ్‌ల రద్దుకు పోరాడాలి appeared first on Navatelangana.

​మోడీ ప్రజ్యావతిరేక విధానాలను తిప్పికొట్టాలి :సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌వి. రమసీఐటీయూ రాజన్న సిరిసిల్ల జిల్లా మహాసభ ప్రారంభం నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి / రాజన్నసిరిసిల్లకార్మికుల హక్కులను హరించే నాలుగు లేబర్‌ కోడ్‌ల రద్దు కోసం రైతు ఉద్యమ స్ఫూర్తితో యావత్‌ కార్మిక లోకం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌వి.రమ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం
The post లేబర్‌ కోడ్‌ల రద్దుకు పోరాడాలి appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *