Headlines

కారులో వ్యాపించిన మంటలు.. పోలీసు సజీవదహనం

బెంగళూరు: కారులో మంటలు వ్యాపించి ఓ పోలీసు అధికారి సజీవ దహనమైన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. శనివారం ధారవాద జిల్లా అన్నిగెరె వద్ద ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గదగ్ లోకయుక్త ఎస్పి కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న పంచాక్షరయ్య శాలిమఠ్(38), ధారవాదలో వివాహానికి హాజరై కారులో తిరిగి వెళ్తున్నారు. అయితే ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి కారు పక్కనే ఉన్న వంతెనను ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించి పంచాక్షరయ్య ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

​బెంగళూరు: కారులో మంటలు వ్యాపించి ఓ పోలీసు అధికారి సజీవ దహనమైన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. శనివారం ధారవాద జిల్లా అన్నిగెరె వద్ద ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గదగ్ లోకయుక్త ఎస్పి కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న పంచాక్షరయ్య శాలిమఠ్(38), ధారవాదలో వివాహానికి హాజరై కారులో తిరిగి వెళ్తున్నారు. అయితే ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి కారు పక్కనే ఉన్న వంతెనను ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించి పంచాక్షరయ్య ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *