విజయనగరం రోటరీ క్లబ్ ఆఫ్ విజయనగరం కమ్యూనిటీ ప్రాజెక్ట్ లో భాగంగా స్థానిక కొత్తగ్రహారంలో గల రోటరీ ద్వారం నరసింగరావు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ సొసైటీ ద్వారా నడుపబడుతున్న రోటరీ దశిగి పేర్రాజు మ్యూజిక్ అకాడమీ 3వ వార్షికోత్సవం శనివారం సాయంత్రం రోటరీ కమ్యూనిటీ హాల్ నందు ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ , గౌరవ అతిథిగా చెన్నైకి చెందిన ప్రముఖ వీణ విద్వాంసులు బోనాల శంకర్ ప్రకాశ్, అతిథులు డాక్టర్ డి.వి.శ్రీకాంత్, అనిల్ కుమార్, ఉసిరికల చంద్రశేఖర రావు, అకాడెమీ ప్రిన్సిపాల్ డాక్టర్ మండపాక రవి వేదికను అలంకరించారు. ముందుగా శంకర ప్రకాష్ విద్యార్ధులకు సంగీతం ప్రాక్టీసు పై అవగాహన చేస్తూ క్లాస్ నిర్వహించారు. అంతరం అకాడమీ విద్యార్థుల ప్రదర్శనలు, గౌరవ అతిధి శంకర ప్రకాష్ వీణ కచేరి అద్భుతంగా జరిగింది. ఇటీవల అంతర్జాలంలో నిర్వహించిన నాదారాధన – 2025 సంగీతపోటీల విజేతలకు బహుమతి ప్రదానం, పోటీలలో న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన పద్మప్రియ, జయంతి రమ, శారద,మహేశ్వర రావు, భానుహర్ష, కాళ్ళ నిర్మల లకు ముఖ్య అతిధి చేతులమీదుగా సత్కార కార్యక్రమం జరిగింది. గౌరవ అతిథిగా విచ్చేసిన బోనాల శంకర్ ప్రకాశ్ కు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతులమీదుగా సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ విజయనగరం తరఫున అధ్యకులు శ్రీనివాస రావు, కార్యదర్శి రాధికారాణి రొటేరియన్లు పి.డి.జి మళ్ళా వెంకటేశ్వర రావు, డి.బాలాజీ, సూర్యలక్ష్మి, మేఘరాజ్ , చెన్నయ్య శెట్టి, కాపుగంటి రవి మురళీకృష్ణ తదితర సభ్యులు వొకేషనల్ ఎక్స్లెన్స్ అవార్డ్ ప్రదానం చేశారు. అనంతరం కొండపల్లి శ్రీనివాస్ కుటుంబాన్ని సభ్యులు సత్కరించారు. మంత్రి వర్యులు మాట్లాడుతూ ఈ అకాడమీ ఇంకా అభివృద్ధిలోకి వచ్చి మన విజయనగర సంగీత ఖ్యాతిని విస్తరిస్తుందని దీనికి తనవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలియజేశారు. ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ధవళ సర్వేశ్వర రావు, బ్రాహ్మణ సంఘ సభ్యులు, విజయభావన కార్యదర్శి డాక్టర్ ఎ. గోపాల రావు, తదితరులు, నగరంలోని ప్రముఖులు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఘనంగా రోటరీ మ్యూజిక్ అకాడమీ 3వ వార్షికోత్సవం….
ఘనంగా రోటరీ మ్యూజిక్ అకాడమీ 3వ వార్షికోత్సవం….



