Headlines

క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

హీరో ధనుష్‌ ఎప్పుడూ వినూత్నమైన కథలతో, అద్భుతమైన నటనతో అలరిస్తుంటారు. ప్రత్యేకమైన కథల ఎంపికతో డైరెక్టర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘పా పాండి’, ‘రాయన్‌’ చిత్రాలతో వరుస విజయాలు సాధించిన ఆయన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ వంటి యూత్‌ఫుల్‌ ఫీల్‌గుడ్‌ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు తన డైరెక్షన్‌లో నాలుగో సినిమాగా ‘ఇడ్లీ కొట్టు’తో వస్తున్నారు. 147 నిమిషాల పర్ఫెక్ట్‌ రన్‌ టైంతో ఈ చిత్రానికి యూ సర్టిఫికేట్‌ లభించింది. గత సినిమాలకంటే భిన్నంగా, ‘ఇడ్లీ కొట్టు’ గ్రామీణ వాతావరణంలో సాగే భావోద్వేగాలు కథ. ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఫ్యామిలీ వ్యాల్యూస్‌, ఎమోషనల్‌ లేయర్లతో ధనుష్‌ స్టోరీ టెల్లింగ్‌ అదిరిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఎస్విఎం ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రామారావు చింతలపల్లి గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు.

ఇప్పటికే ట్రైలర్‌, ప్రమోషన్లు అద్భుతమైన రెస్పాన్స్‌ అందుకున్నాయి. సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే ధనుష్‌, నిత్యా మీనన్‌ జంట మరోసారి రీయూనియన్‌ అవ్వడం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరిద్దరి కెమిస్ట్రీ ‘తిరు’ చిత్రంలో ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. మరోసారి అలరించడానికి సిద్ధం కావడంతో ఫ్యాన్స్‌ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. అద్భుతమైన ప్రీ రిలీజ్‌ రిపోర్ట్స్‌తో నేటి (బుధవారం) నుండి ఈ క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ థియేటర్లలో రిలీజ్‌ అవుతోంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది. ‘ధనుష్‌ నటించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించడం చాలా ఆనందంగా ఉంది. మంచి కథ, కంటెంట్‌ ఉంటే మన తెలుగు ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తారు. అలాంటి కోవలోనే ఈ సినిమా సైతం మన ప్రేక్షకుల మనసుల్ని గెలుస్తుందనే నమ్మకంతో ఉన్నాం. ఈచిత్రాన్ని భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. థియేటర్లకు వెళ్ళిన ప్రేక్షకులు సినిమా చూసిన తరువాత ఓ మంచి సినిమా చూశామనే సంతృప్తితో బయటకు వస్తారు’ అని నిర్మాత రామారావు చింతపల్లి అన్నారు.

The post క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ appeared first on Navatelangana.

​హీరో ధనుష్‌ ఎప్పుడూ వినూత్నమైన కథలతో, అద్భుతమైన నటనతో అలరిస్తుంటారు. ప్రత్యేకమైన కథల ఎంపికతో డైరెక్టర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘పా పాండి’, ‘రాయన్‌’ చిత్రాలతో వరుస విజయాలు సాధించిన ఆయన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ వంటి యూత్‌ఫుల్‌ ఫీల్‌గుడ్‌ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు తన డైరెక్షన్‌లో నాలుగో సినిమాగా ‘ఇడ్లీ కొట్టు’తో వస్తున్నారు. 147 నిమిషాల పర్ఫెక్ట్‌ రన్‌ టైంతో ఈ చిత్రానికి యూ సర్టిఫికేట్‌ లభించింది. గత సినిమాలకంటే
The post క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *