Headlines

వైద్యకళాశాలల ప్రైవేటీకరణపై దద్దరిల్లిన మండలి

. పీపీపీ విధానంపై వైసీపీ నిరసన
. అధికార, ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో గందరగోళం
. కొనసాగిన వాయిదాల పర్వం

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ, పీపీపీ విధానంపై నిరసనలతో శాసన మండలి దద్దరిల్లింది. తొలిరోజు యూరియా కొరతపై గళం విప్పిన ఎమ్మెల్సీలు రెండో రోజు గురువారం వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై నిరసనకు దిగారు. ప్లకార్డులతో ప్రదర్శనగా మండలిలోకి వచ్చారు. అనంతరం చైర్మన్‌ కొయ్యే మోషెన్‌రాజు వచ్చిన వెంటనే ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ, పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ… సభ్యులు మొండితోక అరుణ్‌కుమార్‌, సిపాయి సుబ్రహ్మణ్యం, కుంభా రవిబాబు వాయిదా తీర్మానం ఇవ్వగా…దానిని చైర్మన్‌ తిరస్కరించడంతో పీపీపీ పద్ధతిలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ‘సిగ్గు..సిగ్గు’ అంటూ ప్లకార్డులతో చైర్మన్‌ పోడియం వద్ద కొందరు, పోడియం పైకి ఎక్కి మరికొందరు వైసీపీ ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. చైర్మన్‌ వారించినప్పటికీ వెనక్కి తగ్గకపోవడంతో ప్రశ్నోత్తరాలు చేపట్టారు. మంత్రులు నారా లోకేశ్‌, నిమ్మల రామానాయుడు, పి.నారాయణ వైసీపీ సభ్యుల నిరసనల మధ్యే వారి ప్రశ్నలకు జవాబులిచ్చారు. ఒక వైపు వైసీపీ సభ్యుల నినాదాలు, ప్రశ్నోత్తరాల కొనసాగింపుతో సభలో గందరగోళం నెలకొంది. మళ్లీ చైర్మన్‌ జోక్యం చేసుకుని బీఏసీలో దీనిపై చర్చించేందుకు ప్రభుత్వం అనుమతిస్తుందని పదేపదే చెప్పినా… వైసీపీ సభ్యులు నిరసన కొనసాగించడంతో మండలిని వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమయ్యాక ప్రశ్నోత్తరాల కొనసాగింపునకు చైర్మన్‌ అవకాశం ఇవ్వగా… జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తన ప్రశ్నలకు జవాబులు ఇస్తుండగా… మళ్లీ వైసీపీ సభ్యులు చైర్మన్‌ పోడియం చుట్టుముట్టారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ, పీపీపీ విధానంపై చర్చ చేపట్టాలని నినదించగా… చైర్మన్‌ స్పందిస్తూ ఆ అంశంపై చర్చకు బీఏసీలో నిర్ణయించామని మండలి సజావుగా కొనసాగేలా చూడాలని కోరారు. అయినా వైసీపీ సభ్యులు నినాదాలతో హోరెత్తించడంతో రెండోసారి మండలిని వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ సభ ప్రారంభమయ్యాక కూడా మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతుండగా… వైసీపీ ఎమ్మెల్సీలు పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్సీలు రామ్‌భూపాల్‌రెడ్డి, గ్రీష్మ తదితరులు సైతం చైర్మన్‌ పోడియం వద్దకొచ్చి నిరసనకు దిగారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణ దశలో ఉన్న వైద్యకళాశాలల పునాదుల ఫోటోలను ప్రదర్శించారు. అటు వైసీపీ, ఇటు టీడీపీ సభ్యుల నిరసనలతో మండలి ఒక్కసారిగా వేడెక్కింది. ఇదే సమయంలో ప్రశ్నోత్తరాల ప్రతులను వైసీపీ సభ్యులు చించి గాల్లోకి ఎగరేశారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు గట్టిగా అరుస్తూ విమర్శలు చేసుకున్నారు. ఆ తర్వాత మంత్రుల సూచనలతో టీడీపీ సభ్యులు వెనక్కి వచ్చి తమ సీట్లలో కూర్చున్నారు. బీజేపీ సభ్యులు సోము వీర్రాజు మాట్లాడుతూ, గందరగోళం నివారించి…సభ సజావుగా సాగేలా చూడాలని కోరారు. జీఎస్టీ సంస్కరణపై స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను మండలి చైర్మన్‌ కోరారు. ముందు సభను ఆర్డరులో పెట్టాలని, ఆ తర్వాత తాను మాట్లాడతానని పయ్యావుల అన్నారు. తమ సభ్యులతో నిరసన విరమింపజేయాలని మండలిలో వైసీపీ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణను చైర్మన్‌ కోరారు. ముందు ప్రైవేట్‌ వైద్య కళాశాలలపై చర్చకు ప్రభుత్వం ప్రకటన చేయాలని ఆయన అన్నారు. నిరసనలు, నినాదాలు చేస్తున్న సభ్యులను మళ్లీ చైర్మన్‌ విరమించాలని కోరారు. వాళ్లు వెనక్కి తగ్గకపోవడంతో సోమవారానికి మండలిని వాయిదా వేశారు.

The post వైద్యకళాశాలల ప్రైవేటీకరణపై దద్దరిల్లిన మండలి appeared first on Visalaandhra.

​. పీపీపీ విధానంపై వైసీపీ నిరసన. అధికార, ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో గందరగోళం. కొనసాగిన వాయిదాల పర్వం విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ, పీపీపీ విధానంపై నిరసనలతో శాసన మండలి దద్దరిల్లింది. తొలిరోజు యూరియా కొరతపై గళం విప్పిన ఎమ్మెల్సీలు రెండో రోజు గురువారం వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై నిరసనకు దిగారు. ప్లకార్డులతో ప్రదర్శనగా మండలిలోకి వచ్చారు. అనంతరం చైర్మన్‌ కొయ్యే మోషెన్‌రాజు వచ్చిన వెంటనే ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ, పీపీపీ విధానాన్ని
The post వైద్యకళాశాలల ప్రైవేటీకరణపై దద్దరిల్లిన మండలి appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *