Headlines

అందుబాటులో లేని108 వాహన సేవలు

అత్యవసర వాహనానికే సుస్తీ చేస్తే ఎలా?

విశాలాంధ్ర – సీతానగరం: ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా 108 అంబులెన్స్ సేవలను ప్రజలకు ప్రభుత్వం అందిస్తుంది. అలాంటి ఈ అత్యవసర సేవలు అందించే 108 వాహనంకు గత కొన్ని రోజులుగా సుస్తీ చేసింది. మండల వ్యాప్తంగా గల 21 పంచాయతీలలో 23 గ్రామాలకు చెందిన ప్రజలకు అత్యవసర సమయంలో సేవలు అందించే 108 వాహనం పని చేయక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పాలు అవుతున్నాము అని అవేదన వ్యక్తం చేస్తున్నారు. మనిషి చివరి నిమిషంలో ప్రాణాలతో పోరాడే సమయంలో ఎంతో మంది ప్రాణాలను కాపాడిన ఈ 108 అంబులెన్స్ సేవలు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. అలాంటి ఈ సేవలు నేడు అందకపోవడంతో కవచం, జనసేన పార్టీ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ నడుపుతున్న అంబులెన్స్ వాహనాల పై ప్రజలు ఆధారపడి ఉన్నారు. కానీ ఈ వాహన సేవలు అందించే పాన్ నెంబర్లు అందరికీ తెలియవు కాబట్టి ప్రజలు అత్యవసర సమయాలలో తమ కుటుంబ సభ్యులు ప్రాణాలు కాపాడుకోవడానికి ముందుగా గుర్తు వచ్చే అత్యవసర సేవల నెంబర్ 108 మాత్రమే అంటే అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రజల్లో ఈ అత్యవసర సేవలు అందించే 108 చెరగని ముద్ర వేసింది. అలాంటి ఈ అత్యవసర సేవలు అందించే 108 మండల వాహనం పని చేయకపోవడంతో ప్రజలు అయోమయ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏది ఏమైనా ప్రజల ప్రాణాలను చివరి నిమిషంలో కాపాడే 108 అంబులెన్స్ సేవలను నిరంతరం అందించే విధంగా అధికారులు, నాయకులు స్పందించి సత్వర చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

The post అందుబాటులో లేని108 వాహన సేవలు appeared first on Visalaandhra.

​అత్యవసర వాహనానికే సుస్తీ చేస్తే ఎలా? విశాలాంధ్ర – సీతానగరం: ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా 108 అంబులెన్స్ సేవలను ప్రజలకు ప్రభుత్వం అందిస్తుంది. అలాంటి ఈ అత్యవసర సేవలు అందించే 108 వాహనంకు గత కొన్ని రోజులుగా సుస్తీ చేసింది. మండల వ్యాప్తంగా గల 21 పంచాయతీలలో 23 గ్రామాలకు చెందిన ప్రజలకు అత్యవసర సమయంలో సేవలు అందించే 108 వాహనం పని చేయక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పాలు అవుతున్నాము
The post అందుబాటులో లేని108 వాహన సేవలు appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *