Headlines

పోలియో ని పారద్రోలాలి

పోలియో మహమ్మారిని శాశ్వతంగా పారద్రోలాలి 

విశాలాంధ్ర – నిడదవోలు : చిన్నారులు పాలిట శాపంగా మారిన పోలియో మహమ్మారిని ప్రపంచం నుండి శాశ్వతంగా పారద్రోలాలని రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు ప్రెసిడెంట్ రోటోరియన్ మీసాల శివరామ హరిప్రసాద్ అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు ఆధ్వర్యంలో  వరల్డ్ పోలియో డే ను స్థానిక జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు  మీసాల శివరామ హరిప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పోలియో మహమ్మారిని తరిమికొట్టడానికి రోటరీ చేస్తున్న కృషి అమోఘమని, ప్రతి ఒక్కరూ పోలియోపైఅవగాహన పెంచుకొని పోలియో రహిత సమాజాన్ని నిర్మించడమే ధ్యేయంగా కృషి చేయాలనన్నారు.వరల్డ్ పోలియో డే ని పురస్కరించుకొని  800 మంది విద్యార్థునులచే పోలియో మహమ్మారిని తరిమేద్దాం, పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం అని నినాదాలతో శాంతియుత ర్యాలీ నిర్వహించి,మానవహారం నిర్మించారు.ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సెక్రెటరీ దారపురెడ్డి శ్రీరామప్రతాప్, ట్రెజరర్ గుంటుపల్లి సత్యసాయి, సీనియర్ రొటీరియన్స్ గోపిరెడ్డి శ్రీనివాస్, ఎండి ఫయాజ్, పొన్న సుబ్రహ్మణ్యం, సానేపు వెంకట సుబ్బారావు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం రాజేశ్వరి ఫిలిప్స్, వ్యాయామ ఉపాధ్యాయులు కృష్ణకుమారి, జేమ్స్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థునులు పాల్గొన్నారు.

The post పోలియో ని పారద్రోలాలి appeared first on Visalaandhra.

​పోలియో మహమ్మారిని శాశ్వతంగా పారద్రోలాలి  విశాలాంధ్ర – నిడదవోలు : చిన్నారులు పాలిట శాపంగా మారిన పోలియో మహమ్మారిని ప్రపంచం నుండి శాశ్వతంగా పారద్రోలాలని రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు ప్రెసిడెంట్ రోటోరియన్ మీసాల శివరామ హరిప్రసాద్ అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు ఆధ్వర్యంలో  వరల్డ్ పోలియో డే ను స్థానిక జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు  మీసాల శివరామ హరిప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పోలియో
The post పోలియో ని పారద్రోలాలి appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *