Headlines

విదేశీ మారకం నిల్వల్లో భారీ పతనం

వారంలో 6.9 బిలియన్‌ డాలర్ల తగ్గుదల
ఆర్బీఐ వెల్లడి

ముంబయి : భారతదేశ విదేశీ మారకం నిల్వల్లో భారీ తగ్గుదల చోటు చేసుకుంది. అక్టోబర్‌ 24తో ముగిసిన వారంలో ఏకంగా 6.9 బిలియన్‌ డాలర్లు తగ్గి 695.355 బిలియన్లకు చేరుకున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. ఇది ఇంతక్రితం వారంలో నమోదైన 702.28 బిలియన్లతో పోల్చితే తగ్గుదలను సూచిస్తుందని వెల్లడించింది. ఫారెక్స్‌ నిల్వలలో ప్రధాన భాగం అయినా విదేశీ కరెన్సీ ఆస్తులు సమీక్షా వారంలో 3.862 బిలియన్‌ డాలర్లు తగ్గి 566.548 బిలియన్లకు పరిమితమయినట్టు ఆర్బీఐ తెలిపింది. ఈ ఆస్తులలో యూరో, యెన్‌, పౌండ్‌ వంటి కరెన్సీలు డాలర్‌తో పోలిస్తే విలువలో హెచ్చు తగ్గులు చెందడం ఈ తగ్గుదలకు కారణం.

ఇటీవల డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడంతో ఈ విలువ తగ్గింది. అదే సమయంలో బంగారం నిల్వలు 3.01 బిలియన్లు తగ్గి 105.536 బిలియన్లకు చేరాయి. స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ (ఎస్‌డీఆర్‌) 58 మిలియన్లు తగ్గి 18.664 బిలియన్‌ డాలర్లకు తగ్గాయని వెల్లడించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌)లో భారతదేశ నిల్వలు 6 మిలియన్‌ డాలర్లు పెరిగి 4.608 బిలియన్లుగా చోటు చేసుకున్నాయి. భారత విదేశీ మారకం నిల్వలు తగ్గితే ప్రధానంగా రూపాయిపై ఒత్తిడి పెరగనుంది.

The post విదేశీ మారకం నిల్వల్లో భారీ పతనం appeared first on Navatelangana.

​వారంలో 6.9 బిలియన్‌ డాలర్ల తగ్గుదలఆర్బీఐ వెల్లడి ముంబయి : భారతదేశ విదేశీ మారకం నిల్వల్లో భారీ తగ్గుదల చోటు చేసుకుంది. అక్టోబర్‌ 24తో ముగిసిన వారంలో ఏకంగా 6.9 బిలియన్‌ డాలర్లు తగ్గి 695.355 బిలియన్లకు చేరుకున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. ఇది ఇంతక్రితం వారంలో నమోదైన 702.28 బిలియన్లతో పోల్చితే తగ్గుదలను సూచిస్తుందని వెల్లడించింది. ఫారెక్స్‌ నిల్వలలో ప్రధాన భాగం అయినా విదేశీ కరెన్సీ ఆస్తులు సమీక్షా వారంలో 3.862
The post విదేశీ మారకం నిల్వల్లో భారీ పతనం appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *