నవంబర్ 3వ న కడియపులంక లో కోటి దీపోత్సవం.
విశాలాంధ్ర – కడియం : కడియం మండలం, కడియపులంక శ్రీ ఆంజనేయస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకొని కోటి దీపోత్సవ కార్యక్రమం నవంబర్ 3వ తేదీన నిర్వహించబడుతుందని ఆలయ కమిటీ అధ్యక్షుడు పల్ల సుబ్రహ్మణ్యం తెలిపారు. మూడవ తేదీ కార్తిక సోమవారం ఉదయం ఆంజనేయ స్వామి వారి జన్మ నక్షత్ర పూజ, సాయంత్రం పార్వతీ పరమేశ్వరుల శాంతి కళ్యాణం అనంతరం కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దీపం వెలిగించడం అంటే కేవలం అగ్ని కాకుండా అది మనిషి లో అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞాన ప్రకాశానికి ప్రతీక అని పల్ల సుబ్రహ్మణ్యం అన్నారు. ఆంజనేయస్వామి ఆశీస్సులతో కడియపులంకలో కోటి దీపాలు వెలిగే ఆధ్యాత్మిక కార్యక్రమానికి భక్తులందరినీ ఆహ్వానిస్తున్నామని సుబ్రమణ్యం తెలిపారు.
The post కోటి దీపోత్సవం appeared first on Visalaandhra.
నవంబర్ 3వ న కడియపులంక లో కోటి దీపోత్సవం. విశాలాంధ్ర – కడియం : కడియం మండలం, కడియపులంక శ్రీ ఆంజనేయస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకొని కోటి దీపోత్సవ కార్యక్రమం నవంబర్ 3వ తేదీన నిర్వహించబడుతుందని ఆలయ కమిటీ అధ్యక్షుడు పల్ల సుబ్రహ్మణ్యం తెలిపారు. మూడవ తేదీ కార్తిక సోమవారం ఉదయం ఆంజనేయ స్వామి వారి జన్మ నక్షత్ర పూజ, సాయంత్రం పార్వతీ పరమేశ్వరుల శాంతి కళ్యాణం అనంతరం కోటి దీపోత్సవ
The post కోటి దీపోత్సవం appeared first on Visalaandhra.
