Headlines

ఆవ రైతులను ఆదుకోవాలి

కడియం ఆవ రైతులను వెంటనే ఆదుకోవాలి.

విశాలాంధ్ర – కడియం : ఇటీవల సంభవించిన మొంథా తుఫాన్ వలన రైతులకు విపరీతమైన నష్టం వాటిల్లిందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, వైసిపి మండల అధ్యక్షులు వై సతీష్ చంద్ర స్టాలిన్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కడియం గ్రామంలో గిరజాల బాబు ఇంటి వద్ద జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కడియం మండలంలో అత్యధిక రైతులు వరి పండిస్తారని, ఇటీవల కురిసిన వర్షాల వల్ల వారు పంట నష్టపోయి దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారని అన్నారు. ప్రభుత్వం రైతులకు ఉచిత పంటల భీమా చెల్లించక పోవడాన్ని తీవ్రంగా విమర్శించారు. ఉచిత పంట బీమా చెల్లించి ఉంటే పంట నష్టం వచ్చివుండేది కాదని అన్నారు. గతంలో తమ ప్రభుత్వం పంటలు పాక్షికంగా దెబ్బతిన్నా ఉచిత పంటల భీమా ద్వారా వారికి తగిన రీతిలో పంట నష్టాలను చెల్లించామన్నారు. పంట నష్టం నమోదు చేసి, చెల్లించిన తరువాత ఆ పంటకు సంబంధించిన తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చెయ్యదని చెప్పి, రైతులను భయాందోళనలకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో కౌలు రైతులకు ఎన్నో రాయితీలు ఉండేవని, కానీ ప్రస్తుతం అధికారులు ఎకరా మించి కౌలు చేసే రైతులను మాత్రమే కౌలు రైతులుగా గుర్తించి, ఒక సెంటు తగ్గినా కానీ కౌలు రైతుగా గుర్తించక పోవడాన్ని తప్పుపట్టారు. ఈ విధమైన ప్రభుత్వ ఉత్తర్వులను రద్దుచేసి రైతులను ఆదుకోవాలని లేదంటే రైతులందరూ రోడ్డుమీదకు వచ్చి ఉద్యమాలు చేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు తాడాల విష్ణు చక్రవర్తి, ఈలి గోపాలం, మార్గాని బలరాం, పున్నమి రాజు వీర్రాజు, బట్టు చిన్ని, వంగపండు ప్రసాద్, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

The post ఆవ రైతులను ఆదుకోవాలి appeared first on Visalaandhra.

​కడియం ఆవ రైతులను వెంటనే ఆదుకోవాలి. విశాలాంధ్ర – కడియం : ఇటీవల సంభవించిన మొంథా తుఫాన్ వలన రైతులకు విపరీతమైన నష్టం వాటిల్లిందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, వైసిపి మండల అధ్యక్షులు వై సతీష్ చంద్ర స్టాలిన్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కడియం గ్రామంలో గిరజాల బాబు ఇంటి వద్ద జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కడియం మండలంలో అత్యధిక రైతులు వరి పండిస్తారని, ఇటీవల కురిసిన వర్షాల వల్ల వారు
The post ఆవ రైతులను ఆదుకోవాలి appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *