Headlines

Weather Updates: ఏపీకి రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు..

Thunderstorm

Weather Updates: ఏపీకి రెయిన్ అలర్ట్ ఇచ్చింది విపత్తు నిర్వహణ సంస్థ. ఇవాళ పలు జిల్లాల్లో వానలు కురుస్తాయని APSDMA తెలిపింది. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలు పడే అవకాశం ఉందని చెప్పింది.

మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు పడొచ్చని అంచనా వేసింది. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించింది. సురక్షితమైన ప్రదేశాల్లోనే ఉండాలని జాగ్రత్తలు చెప్పింది.

తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. నేడు ఉదయం 8గంటల 30 నిమిషాల వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, యాదాద్రి, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.

​అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించింది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *