➖ ప్రాంతీయ శిక్షణా కేంద్రం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు.
➖ 200 మంది విద్యార్థులకు అవసరమయ్యే డార్మిటరీ నిర్మాణానికి, ప్రాంగణంలోకి ప్రవేశించే రహదారి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రాంతీయ శిక్షణా కేంద్రం, పూల్ బాగ్, విజయనగరంలో జరుగుతున్న పీఎం శ్రీ పాఠశాలల మహిళా ఉపాధ్యాయుల అడ్వాన్స్డ్ గైడ్ కెప్టెన్ శిక్షణా శిబిరాన్ని 6వ రోజు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులు నాయుడు సందర్శించారు. ముందుగా గైడ్ కెప్టెన్లు తయారు చేసిన క్యాంప్ క్రాఫ్ట్, గాడ్జెట్లు, పయనీరింగ్ ప్రాజెక్టులు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మీ సేవాభావంతో పిల్లల్లో దేశభక్తి, క్రమశిక్షణ, నిజాయితీ, ధైర్యసాహసాలు, సమైక్యత భావన పెంపొందించే బాధ్యతను స్వచ్చందంగా తీసుకొని శిక్షణకు ముందుకు వచ్చినందుకు అభినందించారు. ప్రాంతీయ శిక్షణా కేంద్రం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ఒకేసారి 200 మంది విద్యార్థులైనా శిక్షణ పొందుటకు అవసరమయ్యే డార్మిటరీ నిర్మాణానికి, ప్రాంగణంలోకి ప్రవేశించే రహదారి అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు. ఈ సందర్భంగా జట్టు నాయకత్వ శిక్షణ పూర్తి చేసుకున్న గైడ్ విద్యార్థుల సర్టిఫికెట్లను సంబంధిత ఉపాధ్యాయినిలకు ప్రధానం చేశారు. Ch.L.N కామేశ్వరి ఈ కోర్సుకి లీడరుగా వ్యవహరిస్తున్నారు. జిల్లా కార్యదర్శి వాక చిన్నంనాయుడు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాల నుంచి 20 పాఠశాలల ఉపాధ్యాయినిలు ఇందులోని స్కిల్స్ ను అభివృద్ధి చేసుకొనుటకు పాల్గొన్నారన్నారు. కార్యక్రమంలో గైడ్స్ కమిషనర్ కె సౌభాగ్య లక్ష్మి, జాయింట్ సెక్రెటరీ S.కనకలక్ష్మి, DTC A.కనక లక్ష్మి, ట్రైనింగ్ కౌన్సిలర్ పీవీ శార్వాణి, ASOC దుర్గా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.



