భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 75వ వసంతాలు పూర్తిచేసుకొన్న సందర్భంగా డైమండ్ జూబ్లీ వేడుకల్లో భాగంగా గ్రీన్ సిటీ స్కూల ప్రిన్సిపల్ పి సుశీల పర్యవేక్షణలో గుండి యశోద కనకరాజు కుమార్ ఆధ్వర్యంలో బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా ఆర్గనైజింగ్ కమిషనర్ డాక్టర్, మారుతి హరీష్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కౌట్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛభారత్ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రతి ఒక్క విద్యార్థి ఇందులో భాగం కావాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ట్రైనింగ్ కౌన్సిలర్ గుండి జానకిరామ్,గైడ్ కెప్టెన్ ఎం భవాని,జి సౌజన్య పాఠశాల క్యాంపస్ ఇంచార్జ్ బి రంజిత్ కుమార్, కాటన్ గైడ్స్ విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థుల ఆధ్వర్యంలో బీచ్ క్లీనింగ్
స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థుల ఆధ్వర్యంలో బీచ్ క్లీనింగ్
