Headlines

వైద్యం ఒకరికి అయితే, ప్రిస్క్రిప్షన్ లో మరొకరి పేరు

విశాలాంధ్ర – కడియం : కడియం ప్రభుత్వ ఆసుపత్రిలో దామిశెట్టి రత్నకుమారి పేరుకు బదులుగా వేరొకరి పేరుతో వైద్య పరీక్షలు, ఎక్సరే పరీక్షలు నిర్వహించి, మందులు రాసారని రత్నకుమారి భర్త నాగరాజు ఆరోపించారు. వైద్య పరీక్షలు నిమిత్తం దామిశెట్టి రత్నకుమారి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారని ఆయన తెలిపారు. అయితే సిబ్బంది నిర్లక్ష్యంతో తమ భార్య మెడికల్ ప్రిస్క్రిప్షన్ ను మరొకరి పేరుతో చేయించారని ఆరోపించారు. ఎక్స్ రే, రక్త పరీక్షలు చేసి, మందులు కూడా వేరొకరి పేరు పై ఇచ్చారని తెలిపారు. ఇదే విషయమై సిబ్బందిని నిలదీయగా వైద్యులు మరియు సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరికి బదులు వేరొకరికి వైద్యం జరిగితే బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. నిర్లక్ష్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ తాసిల్దార్ సునీల్ కుమార్ కు ఫిర్యాదు చేసినట్టు నాగరాజు తెలిపారు. ఈ విషయమై తాసిల్దార్ సునీల్ కుమార్ ను వివరణ అడగగా నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు అందిందని, సంబంధిత అధికారులకు వాస్తవాలు తెలపాలని సిఫార్సు చేసినట్టు తెలిపారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధురిని వివరణ అడగగా, రత్నకుమారి గత అక్టోబర్ నెలలో వైద్యం నిమిత్తం ఆసుపత్రిలో చేరారని, ఆధార్ లింక్డ్ ఫోన్ నెంబర్ తో ఓపీ జనరేట్ చేసి వైద్యం చేయడం జరిగిందని తెలిపారు. అయితే ఈరోజు మంగళవారం ఓపి జనరేషన్ సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్ వేరొకరి ఆధార్ తో లింకు అయి ఉండడం వలన వేరే వారి పేరు మీదగా ఓపీ జనరేట్ అయిందని తెలిపారు. రత్నకుమారి పేరును ఓపీ కౌంటర్ నందు సరిచూసుకోవడం మానేసి, తమపై ఓపీ తప్పుగా ఇచ్చినట్లు అభియోగం మోపుతున్నారని తెలిపారు. ఓపీకి సంబంధించిన వివరాలు ఏ.బి.హెచ్.ఎ మరియు ఆరోగ్యశ్రీ అధికారులకు సమర్పించామని తెలిపారు.

The post వైద్యం ఒకరికి అయితే, ప్రిస్క్రిప్షన్ లో మరొకరి పేరు appeared first on Visalaandhra.

​విశాలాంధ్ర – కడియం : కడియం ప్రభుత్వ ఆసుపత్రిలో దామిశెట్టి రత్నకుమారి పేరుకు బదులుగా వేరొకరి పేరుతో వైద్య పరీక్షలు, ఎక్సరే పరీక్షలు నిర్వహించి, మందులు రాసారని రత్నకుమారి భర్త నాగరాజు ఆరోపించారు. వైద్య పరీక్షలు నిమిత్తం దామిశెట్టి రత్నకుమారి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారని ఆయన తెలిపారు. అయితే సిబ్బంది నిర్లక్ష్యంతో తమ భార్య మెడికల్ ప్రిస్క్రిప్షన్ ను మరొకరి పేరుతో చేయించారని ఆరోపించారు. ఎక్స్ రే, రక్త పరీక్షలు చేసి, మందులు కూడా వేరొకరి పేరు
The post వైద్యం ఒకరికి అయితే, ప్రిస్క్రిప్షన్ లో మరొకరి పేరు appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *