Headlines

మొదటి రోజు మందకొడిగా నామినేషన్లు

నవతెలంగాణ – మిర్యాలగూడ 
గ్రామపంచాయతీ సర్పంచుల ఎన్నికలకు మిర్యాలగూడ డివిజన్ లో రెండవ విడత నిర్వహిస్తుండగా నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అయ్యింది. మొదటి రోజు ఆదివారం మిర్యాలగూడ మండలంలో 46 గ్రామపంచాయితీ లకు గాను 21 సర్పంచుల కు 394 వార్డులకు గాను 24 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మండలములోని యాద్గారిపల్లి, వాటర్ ట్యాంకు తండా, ఐలాపురం క్లాస్టర్ల పరిధిలో 3 గ్రామాల చొప్పున ఉన్న ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు.

తుంగపాడు క్లస్టర్ పరిధిలో ఒక్క నామినేషన్ దాఖలు చేశారు. ఆలగడప, గూడూరు, కొత్తగూడెం, రాయినిపాలెం, శ్రీనివాస్ నగర్, తడకమళ్ళ,వెంకటాద్రి పాలెం క్లాస్టర్లలో రెండు చొప్పున ఉట్లపల్లి, జప్తి వీరప్పగూడెం క్లాస్టర్లలో మూడు చొప్పున నామినేషన్లు దాఖలు అయ్యాయి. సోమవారం మంచి రోజు ఉండటంతో ఎక్కువమంది నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉన్నది. చివరి రోజు మంగళవారం పెద్దగా నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం లేదని ఆయా రాజకీయ పార్టీల నాయకులు చెపుతున్నారు.

The post మొదటి రోజు మందకొడిగా నామినేషన్లు appeared first on Navatelangana.

​నవతెలంగాణ – మిర్యాలగూడ గ్రామపంచాయతీ సర్పంచుల ఎన్నికలకు మిర్యాలగూడ డివిజన్ లో రెండవ విడత నిర్వహిస్తుండగా నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అయ్యింది. మొదటి రోజు ఆదివారం మిర్యాలగూడ మండలంలో 46 గ్రామపంచాయితీ లకు గాను 21 సర్పంచుల కు 394 వార్డులకు గాను 24 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మండలములోని యాద్గారిపల్లి, వాటర్ ట్యాంకు తండా, ఐలాపురం క్లాస్టర్ల పరిధిలో 3 గ్రామాల చొప్పున ఉన్న ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు. తుంగపాడు క్లస్టర్ పరిధిలో ఒక్క
The post మొదటి రోజు మందకొడిగా నామినేషన్లు appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *