Headlines

SIP Calculator : డబ్బు సంపాదించడం ఇంత ఈజీనా? SIPలో ఇలా ఇన్వెస్ట్ చేయండి.. జస్ట్ రూ. 20వేల జీతంతోనే మీరు లక్షాధికారి కావచ్చు..!

SIP Calculator

SIP Calculator : పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, తక్కువ జీతంతో తొందరగా లక్షాధికారి అవ్వలేమా? చాలా మంది తక్కువ జీతంతో అసలు లక్షాధికారి కావడం అసాధ్యమని అనుకుంటారు. కానీ, కేవలం రూ. 20వేల జీతంతో కూడా మీరు లక్షాధికారి కావచ్చని మీకు తెలుసా? అవును.. మీరు చదివింది నిజమే.

మీరు చేయాల్సిందల్లా 50-30-20 ఫార్ములాను (SIP Calculator) పాటించడమే.. ఈ ఫార్ములా దీర్ఘకాలంలో మీరు లక్షాధికారి అయ్యేందుకు దారిచూపిస్తుంది. ఇంతకీ తక్కువ జీతంతో మిలియనీర్ ఎలా మారవచ్చు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

50-30-20 ఫార్ములా ఏమిటి? :
మీ జీతం రూ. 20వేలు మాత్రమే అనుకుందాం. ఇలాంటి పరిస్థితుల్లో మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP)లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. ఈ ఫార్ములా మీ జీతంలో 50శాతం లేదా రూ. 10వేలను అద్దె, బిల్లులు ఇతర ఖర్చుల వంటి ముఖ్యమైన ఖర్చుల కోసం వినియోగించవచచు. ఆ తర్వాత, మిగిలిన 30శాతం హాబీలు, వినోదం కోసం ఉపయోగించండి. ఇప్పుడు, మిగిలిన 20శాతం లేదా రూ. 4వేలు మాత్రమే పెట్టుబడి పెట్టండి.

Read Also : Wedding Insurance : మీరు డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారా? ఇప్పుడే వెడ్డింగ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. లేదంటే భారీగా నష్టపోతారు జాగ్రత్త..!

రూ. 4వేల SIPతో లక్షాధికారిగా.. :
మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ SIPలో నెలకు రూ. 4వేలు పెట్టుబడి పెడితే మీరు దీర్ఘకాలికంగా రూ. లక్ష కన్నా ఎక్కువ కార్పస్‌ను సంపాదించుకోవచ్చు. ఆర్థిక నిపుణులు కూడా SIP అనేది దీర్ఘకాలికంగా భారీ కార్పస్‌ను కూడబెట్టుకోవచ్చునని అంటున్నారు.

ఇందుకోసం వీలైనంత త్వరగా పెట్టుబడి పెట్టడం చేయాలి. మీరు కోరుకుంటే ఒక చిన్న SIPతో ప్రారంభించి మీ జీతం పెరిగేకొద్దీ ఆ పెట్టుబడి మొత్తాన్ని పెంచుకోవచ్చు. దీనినే యాడ్-ఆన్ SIP అంటారు. మీ తక్కువ జీతం ఉన్నప్పటికీ భారీ కార్పస్‌ను ఈజీగా కూడబెట్టుకోవచ్చు.

పెట్టుబడి లెక్కలు ఇలా? :
పెట్టుబడి మొత్తం : నెలకు రూ. 4,000
వడ్డీ రేటు : 12శాతం
పెట్టుబడి కాలం : 28
SIPలో పెట్టుబడిపై అంచనా రాబడి : రూ.1,37,92,924

28 సంవత్సరాల కాలంలో SIPలో రూ. 4వేలు పెట్టుబడి పెట్టడం ద్వారా 12శాతం వడ్డీ రేటుతో కూడా మీరు రూ. 1,37,92,924 కార్పస్‌ను పొందవచ్చు. అధిక వడ్డీ రేట్లతో అధిక రాబడిని అందిస్తాయి. మీరు మీ జీతంతో సంబంధం లేకుండా క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టాలి. రెగ్యులర్ పెట్టుబడులు గణనీయమైన కార్పస్‌ను ఈజీగా అందించగలవు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. మ్యూచువల్ ఫండ్స్ పూర్తిగా మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు మీకు తెలిసిన ఆర్థిక నిపుణులను సంప్రదించండి.

​SIP Calculator : లక్షాధికారిగా ఎలా మారాలి? మీరు కూడా తక్కువ జీతంతో లక్షాధికారిగా మారాలనుకుంటున్నారా? SIP ద్వారా ఎలా సాధ్యమంటే? పూర్తి లెక్కలివే  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *