Headlines

Rare earths: ఈవీల నుంచి మిస్సైల్స్ వరకు.. “రేర్ ఎర్త్” మూలకాలు ఏమిటి.. భారత్‌కు ఎందుకు అవసరం..

India Turns Beach Sand Into Strategic Gold A Wake Up Call On Rare Earths

Rare earths: ప్రపంచం మొత్తం ఇప్పుడు ‘‘రేర్ ఎర్త్ మూలకాల’’ జపం చేస్తోంది. చైనా, అమెరికా, భారత్ ఇలా ప్రతీ దేశానికి ఈ అరుదైన మూలకాలు కావాలి. ఇప్పుడు, ప్రపంచాన్ని శాసించేది ఇదే. మన సెల్ ఫోన్ నుంచి టీవీలు, ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్స్, రాకెట్లు, మిస్సైల్స్ ఇలా ప్రతీ దాంట్లో ఈ అరుదైన మూలకాల అవసరం ఉంది. అందుకే వీటికి ఇంత డిమాండ్ ఉంది. ఇప్పుడు భారత్ కూడా ఈ అరుదైన మూలకాలపై దృష్టి సారించింది. ప్రస్తుతం ప్రపంచంలో రేర్ ఎర్త్ మూలకాలు, రేర్ ఎర్త్ అయస్కాంతాల్లో చైనా గుత్తాధిపత్యం నడుస్తోంది. దీనిని అడ్డుకోవాలంటే భారత్ ఈ రంగంలో స్వావలంభన సాధించాల్సి ఉంది.

రేర్ ఎర్త్ మూలకాలు మొత్తం 17 ఉంటాయి. ఇవి స్కాండియం, యుట్రియం, లాంతానమ్, సెరియం, నియోడిమియం, ప్రేసియోడియం, ఎర్బియం, యిబ్రియం ఇలా లాంతనైడ్ సిరీస్‌లో లోహాలను రేర్ ఎర్త్ మూలకాలుగా పిలుస్తారు. అరుదైన మూలకాలు మోనాజైట్ వంటి ఖనిజాల్లో దాగి ఉంటాయి. వీటిని వేరు చేయడం చాలా ఖరీదైన ప్రక్రియ. ఇది రేడియోధార్మి థోరియంతో సహా అనేక విష వ్యర్థాలను విడుదల చేస్తాయి. దశాబ్ధాలుతా బీచ్ ఇసుకను ఎగుమతి చేసి, పూర్తయిన అయస్కాంతాలను దిగుమతి చేసుకుంటున్న భారత దేశం చివరకు రేర్ ఎర్త్ మూలకాలను తీవ్రంగా పరిగణిస్తోంది.

Read Also: MK Stalin: రాజ్ భవన్ పేరు మార్పుపై వివాదం.. తీవ్ర విమర్శలు చేసిన సీఎం స్టాలిన్…

నవంబర్ 27న, అధిక పనితీరు కలిగిన అరుదైన రేర్ ఎర్త్ అయస్కాంతాల తయారీకి కేంద్రమంత్రివర్గం రూ. 7280 కోట్ల ప్రొడక్ట్ రిలేటెడ్ ప్రోత్సహక పథకాన్ని ప్రకటించింది. విద్యుత్ వాహనాలు, విండ్ టర్బైన్స్‌కు అవసరమైన నియోడైమియం బోరాన్ అయస్కాంతాలను ఉత్పత్తి చేయడానికి ప్లాంట్లను ఏర్పాటు చేసే కంపెనీలకు రూ. 350 కోట్లతో ప్రత్యక్ష నగదు ప్రోత్సహకాలను ప్రకటించింది. ఈ అయస్కాంతాలు చాలా చిన్నగా ఉండీ, శక్తివంతంగా ఉంటాయి.

నియోడిమియం ఇప్పటివరకు కనిపెట్టిన బలమైన శాశ్వత అయస్కాంతం. దీనిని ఎలక్ట్రిక్ వాహనాల మోటర్లలో, విండ్ టర్బైన్లలో ఉపయోగిస్తారు. యూరోపియం, టెర్బియ స్క్రీన్‌లు స్పష్టమైన రంగులను ఇస్తాయి. సెరియం స్మార్ట్‌ఫోన్ గ్లాస్‌కు వాడుతారు. ఇది కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్‌ల వంటి ఎగ్జాస్ట్ గ్యాసులను కూడా శుభ్రం చేస్తుంది. ఇదే కాకుండా క్షిపణులు, ఫైటర్ జెట్లు, ఎంఆర్ఐ యంత్రాలు, హార్డ్ డిస్క్‌లు ఇలా అన్నింటిలో రేర్ ఎర్త్ మెటీరియల్స్ అవసరం.

చైనా ప్రపంచవ్యాప్తంగా అరుదైన భూమి మూలకాల సరఫరాలో 60 శాతం తవ్వుతుంది,దాదాపు 90 శాతం శుద్ధి చేస్తుంది. 2010లో జపాన్‌తో దౌత్య వివాదం సందర్భంగా ఆ దేశానికి ఎగుమతుల్ని నిలిపేసింది. దీంతో వారాల్లోనే ఈ రేర్ ఎర్త్ ధరలు 500 శాతం పెరిగాయి. కార్ల కర్మాగారాలు ఆగిపోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారతదేశంలోని ఒడిశా, కేరళ, తమిళనాడదు తీరాల వెంబడి మోనజైట్ బీచ్ ఇసుక ఉంది. ఇది ప్రపంచ రేర్ ఎర్త్‌లో ఒక శాతం మాత్రమే. అనేక దశాబ్ధాలుగా భారత్ దీనిని ఎగుమతి చేస్తోంది. ఇతర దేశాలు దీనిని శుద్ధి చేసి, అయస్కాంతాలు తయారు చేస్తే 10 రెట్ల ధర చెల్లించి మళ్లీ దిగుమతి చేసుకుంటోంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద రేర్ ఎర్త్ డిపాజిట్స్ కలిగిన ఆస్ట్రేలియాతో భారత్ ఇప్పుడు జట్టు కడుతోంది. రేర్ ఎర్త్‌లో స్వయం స్వావలంభన దిశగా అడుగులు వేస్తోంది.

​Rare earths: ప్రపంచం మొత్తం ఇప్పుడు ‘‘రేర్ ఎర్త్ మూలకాల’’ జపం చేస్తోంది. చైనా, అమెరికా, భారత్ ఇలా ప్రతీ దేశానికి ఈ అరుదైన మూలకాలు కావాలి. ఇప్పుడు, ప్రపంచాన్ని శాసించేది ఇదే. మన సెల్ ఫోన్ నుంచి టీవీలు, ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్స్, రాకెట్లు, మిస్సైల్స్ ఇలా ప్రతీ దాంట్లో ఈ అరుదైన మూలకాల అవసరం ఉంది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *