నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి పట్టణంలోని శ్రీ ఆర్కే హాస్పిటల్, చావా ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే పల్లెకి వైద్యం కార్యక్రమంలో భాగంగా 127 వ ఉచిత మెగా వైద్య శిబిరం భువనగిరి పట్టణంలోని పహాడీ నగర్ శ్రీ ఆర్కే హాస్పిటల్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భువనగిరి టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మేకల రమేష్ హాజరయ్యారు. ఈ వైద్య శిబిరం నందు భువనగిరి పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు ఉచితంగా బీపీ షుగర్ , న్యూరోపతి, బి ఎండి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో డాక్టర్ చావా రాజ్ కుమార్ క్యాంపుకు వచ్చిన ప్రజలకు దీర్ఘకాలిక వ్యాధులు, వాటి నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి వివరించారు.
డాక్టర్ రోనక్ మాట్లాడుతూ ఎముకల దృఢత్వం కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వివిధ రకాల దంత సమస్యలు వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, క్రమం తప్పకుండా చెక్ అప్ చేసుకోవడం వల్ల దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చునని డాక్టర్ అశ్లేష తెలియజేశారు. తదనంతరం సిఐ చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ వైద్య శిబిరం నందు 150 మదికి పైగా పరీక్షలు నిర్వహించినట్లు హాస్పిటల్ యాజమాన్యం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎముకలు, కీళ్ళ వ్యాధులు నిపుణులు డాక్టర్ రోనక్ దినేష్ సోనీ, దంత వైద్య నిపుణులు డాక్టర్ చావా అశ్లేష, హాస్పిటల్ ఇంచార్జ్ కొండల్ రెడ్డి లు పాల్గొన్నారు.
The post ఉచిత మెగా వైద్య శిబిరం.. appeared first on Navatelangana.
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ భువనగిరి పట్టణంలోని శ్రీ ఆర్కే హాస్పిటల్, చావా ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే పల్లెకి వైద్యం కార్యక్రమంలో భాగంగా 127 వ ఉచిత మెగా వైద్య శిబిరం భువనగిరి పట్టణంలోని పహాడీ నగర్ శ్రీ ఆర్కే హాస్పిటల్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భువనగిరి టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మేకల రమేష్ హాజరయ్యారు. ఈ వైద్య శిబిరం నందు భువనగిరి పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు ఉచితంగా బీపీ షుగర్
The post ఉచిత మెగా వైద్య శిబిరం.. appeared first on Navatelangana.
