Headlines

దేశద్రోహులు

గగనమెత్తున గాలిపటానికి ఎన్ని చీరికలో
గమనానికి చేరిన రైలుకు మలుపులెన్నో
చెంగున ఎగిరె చేపలకు గాలాలెన్నో
కొంగలు కొంటెముక్కుల దాడులెన్నో
అత్యున్నత స్థాయిలో ఎదగడం
హరిత విప్లవానికి మొక్కలు నాటినంత సులువు కాదు.
శ్వేత విప్లవం కన్నా సామాజిక విప్లవం కావాలి
శిఖరాగ్రనికి చేరినా చెప్పులు లేస్తుంటాయి
చూపుడువేలై వీధిలో దిశైనా
చేతులు ముక్కు విరిచేస్తూనే…
చెప్పుల దండలతో అవమానిస్తూనే వుంటారు
ఆత్మగౌరవాలపై దాడుల హననాలు
గుడి బడి ఇంకా ముడుచుకుంటున్నాయి
చర్చీల్లో స్వేచ్ఛ లు ల్లేవు
అమ్మవారి ప్రసాదాలు అందని కాలం
పూజారులే కాదు ఫాదర్‌ లు హంతకులే
కర్మభూమిలో గాలికి నీటికి కులముంటుంది
గుడిసెలు ఎన్నిసార్లు కూలినవో
హైడ్రా అయినా, ఆపరేషన్‌ కగారైనా, వేదాలైనా విప్లవమైనా
కంటిశోకాలు కమురు వాసనల వాడలవే
చట్టాల ప్రయోగాలన్నీ గరికపూలమీదనే
నక్షత్రాలు వెలుగుతున్నాయి కానీ
నేల మీది మట్టి మనుషులకు చీత్కారాలు చీదరింపులు
వాకిట్లో కూసాలుడిగిన నాలుగు కాళ్ల కట్టెలపై
ఒట్టికట్టెలయి విగతజీవులై పోయిన మనుషులు
కుల, మతోన్మాదంతో
విరిగిన కాళ్లై బతుకులు తెల్లారిపోతున్నాయి
పెరిగిన బంగారం ధరల్లా
కుల దాడులు అత్యాచారాలు హత్యలు
వేధింపులు అంటరానితనాలు
బంగారానికి ధరల్లా కులికిపోతున్నాయి
శరీరంలో రక్తం లేకపోయినా గుండెకు రక్తం ఆగిపోయినా
క్యాన్సర్‌ రోగమొచ్చినా
బర్రెగొడ్లు గాసినా జీవాలు కాసినా గంజి లేకపోయినా
కులం కులమే వర్ణం అగ్రవర్ణమే
మనిషి మెతుకులతో కాదు కులంతోనే వొలికిపోతున్నాడు
చెట్లు చెట్లుగానే ఉంటాయి
పరులకు ఫలాలను స్వచ్ఛటి గాలులనినిస్తాయి
మనుషులు మనుషుల్లా ఉండరు
కులం రోతలో దొర్లుతూనేవుంటారు
గుంపులో నిలబడినా బస్సుల్లో ప్రయాణించినా
హౌటల్లో తింటున్నా దేశాధినేతగా సంతకం చేసినా
అవమానం తరుముతూవుంటది
స్మశానవాటికల్లో చోటులేని వజ్రోత్సవాలు
ఈసెడింపులు వేధింపుల ఫిర్యాదులకు చెదలు
ఐపీఎస్‌ ఆధికారి ఎనిమిది పేజీల సూసైడ్‌ నోటయినా
పోలీసు తలుపులకు తాళాలు
తెహెల్క స్టింగ్‌ ఆపరేషన్లు ఏసీబీ, సిబిఐ దాడులు అరగారిన వర్గాలపైననే అత్యుత్సాహాలు
అరెస్టులు జీవిత ఖైదీలు చెమటపూలకే
రాజ్యాంగ రక్షణ పగిలిన బోకు పెంకులై
వికసిత భారతం వివక్ష భారత్‌ గా మురుస్తున్నది
దేశద్రోహులు ఎవరోఇప్పుడు చెప్పండి
కులంధరుల పడగనీడల్ని మాట్లాడాలి రాయాలి
తోడేళ్ల దాడుల్ని తిప్పి కొట్టాలి ఎదిరించాలి
మెడలకు తాడుబిగించి ఉసురుత్తిస్తుంటారు
ఊపిరాడదు, ఊరు గొడ్డలి పట్టుకొని ఎదురొస్తుంది
జీవితాలు పెంటకుప్పలేనా
(సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ గవాయిపై బూటు దాడి హర్యానా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పూరన్‌ కుమార్‌ ఆత్మహత్యకు నిరసనగా….)

వనపట్ల సుబ్బయ్య, 9492765358

The post దేశద్రోహులు appeared first on Navatelangana.

​గగనమెత్తున గాలిపటానికి ఎన్ని చీరికలోగమనానికి చేరిన రైలుకు మలుపులెన్నోచెంగున ఎగిరె చేపలకు గాలాలెన్నోకొంగలు కొంటెముక్కుల దాడులెన్నోఅత్యున్నత స్థాయిలో ఎదగడంహరిత విప్లవానికి మొక్కలు నాటినంత సులువు కాదు.శ్వేత విప్లవం కన్నా సామాజిక విప్లవం కావాలిశిఖరాగ్రనికి చేరినా చెప్పులు లేస్తుంటాయిచూపుడువేలై వీధిలో దిశైనాచేతులు ముక్కు విరిచేస్తూనే…చెప్పుల దండలతో అవమానిస్తూనే వుంటారుఆత్మగౌరవాలపై దాడుల హననాలుగుడి బడి ఇంకా ముడుచుకుంటున్నాయిచర్చీల్లో స్వేచ్ఛ లు ల్లేవుఅమ్మవారి ప్రసాదాలు అందని కాలంపూజారులే కాదు ఫాదర్‌ లు హంతకులేకర్మభూమిలో గాలికి నీటికి కులముంటుందిగుడిసెలు ఎన్నిసార్లు కూలినవోహైడ్రా అయినా,
The post దేశద్రోహులు appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *