Headlines

హైదరాబాద్ లో యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం

ప్రపంచ ప్రఖ్యాత యూరోపియన్ సినీ సంస్కృతిని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేస్తూ యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 హైదరాబాద్‌లో శుక్రవారం అద్భుతంగా ప్రారంభమైంది. ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన ఈ ప్రారంభోత్సవానికి సినీ ప్రముఖులు, సాంస్కృతికవేత్తలు, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు హాజరై వేడుకకు ప్రత్యేక శోభను చేకూర్చారు. యూరోపియన్ సినిమాను భారత ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఈ ఫెస్టివల్ 50 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంది. హైదరాబాద్‌లో ఈ స్థాయి ఫెస్టివల్‌ను నిరంతరం నిర్వహించడంలో సారథి స్టూడియోస్ మద్దతు ఎంతో కీలకం అని నిర్వాహకులు వెల్లడించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సారథి స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ ఎంఎస్‌ఆర్‌వి ప్రసాద్, ఈయు ప్రతినిధి బృందం, హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ అధ్యక్షుడు కెవి రావు, ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఇక డిసెంబర్ 5 నుంచి 14 వరకు హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్, సారథి స్టూడియోస్, అలియెన్స్ ఫ్రాన్సైజ్ వేదికల్లో సినిమా ప్రదర్శనలు జరుగనున్నాయి.

​ప్రపంచ ప్రఖ్యాత యూరోపియన్ సినీ సంస్కృతిని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేస్తూ యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 హైదరాబాద్‌లో శుక్రవారం అద్భుతంగా ప్రారంభమైంది. ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన ఈ ప్రారంభోత్సవానికి సినీ ప్రముఖులు, సాంస్కృతికవేత్తలు, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు హాజరై వేడుకకు ప్రత్యేక శోభను చేకూర్చారు. యూరోపియన్ సినిమాను భారత ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఈ ఫెస్టివల్ 50 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంది. హైదరాబాద్‌లో ఈ స్థాయి ఫెస్టివల్‌ను నిరంతరం నిర్వహించడంలో సారథి స్టూడియోస్ మద్దతు ఎంతో కీలకం అని నిర్వాహకులు వెల్లడించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సారథి స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ ఎంఎస్‌ఆర్‌వి ప్రసాద్, ఈయు ప్రతినిధి బృందం, హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ అధ్యక్షుడు కెవి రావు, ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఇక డిసెంబర్ 5 నుంచి 14 వరకు హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్, సారథి స్టూడియోస్, అలియెన్స్ ఫ్రాన్సైజ్ వేదికల్లో సినిమా ప్రదర్శనలు జరుగనున్నాయి.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *