Headlines

Weather Updates: ఏపీకి భారీ వర్ష సూచన.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం.. పిడుగులు పడే ఛాన్స్..!

AP Rains

Weather Updates: పశ్చిమ మధ్య, దాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల్లో అల్పపీడనం కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది 48 గంటల్లో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని వెల్లడించారు. దీనికి అనుబంధంగా ఛత్తీస్‌గఢ్, విదర్భ మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు ద్రోణి కొనసాగుతుందన్నారు.

వీటి ప్రభావంతో రాష్ట్రంలో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చెట్ల కింద నిలబడరాదని సూచించారు.

ఆదివారం (14-09-2025)

* శ్రీకాకుళం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వానలు కురిసే అవకాశం.

శనివారం సాయంత్రం 5 గంటల నాటికి తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి, ఏలూరు జిల్లా లింగపాలెంలో 87.2మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లా పెదకాకానిలో 77.2 మిల్లీమీటర్లు, పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో 75 మిల్లీమీటర్లు, గుంటూరు జిల్లా వల్లభపురంలో 74 మిల్లీమీటర్లు, గుంటూరులో 72.2 మిల్లీమీటర్లు, నూజివీడులో 71 మిల్లీమీటర్లు, కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో 70.7 మిల్లీమీటర్లు, కౌతవరంలో 70.2 మిల్లీమీటర్లు, ప్రకాశం జిల్లా దర్శిలో 68.5 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. 47 ప్రాంతాల్లో 40 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం రికార్డైందని ప్రఖర్ జైన్ వెల్లడించారు.

Also Read: ఏపీలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీల నియామకం.. ఏ జిల్లాకు ఎవరంటే?

​తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *