Headlines

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతి పరిశీలన 

నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను లబ్ధిదారులు వేగవంతం చేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండలంలోని నాగపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. ఇటీవల వర్షాల నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో జాప్యం ఏర్పడిందని, ప్రస్తుతం వర్షాలు తగ్గ ముఖం పట్టినందున వెంటనే ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు.

ఇందిరమ్మ గృహాలను నిర్మించుకుంటున్న లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. అధికారుల సహకారంతో ఇండ్ల నిర్మాణాల్లో ఎలాంటి జాప్యం లేకుండా, వేగంగా ఇండ్ల నిర్మాణం పూర్తయ్యేలా లబ్ధిదారులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు ఇండ్ల నిర్మాణాలు పూర్తయిన వెంటనే దశలవారీగా బిల్లులు చెల్లించడం జరుగుతుందన్నారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి సంధ్య, తదితరులు ఉన్నారు.

The post ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతి పరిశీలన  appeared first on Navatelangana.

​నవతెలంగాణ-కమ్మర్ పల్లిఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను లబ్ధిదారులు వేగవంతం చేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండలంలోని నాగపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. ఇటీవల వర్షాల నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో జాప్యం ఏర్పడిందని,
The post ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతి పరిశీలన  appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *