ఈ సంవత్సరంలో కోటి మొక్కలను నాటడమే మా లక్ష్యం..
పుట్టపర్తి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం : ప్రజలందరూ పర్యావరణ పట్ల బాధ్యతగా ఉండాలని, ఈ సంవత్సరంలో కోటి మొక్కలను నాటడమే లక్ష్యము అని పుట్టపర్తి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా హిందూపూర్ రోడ్డు, ఎర్రగుంట బ్రిడ్జ్ అవతల గల రోడ్డు సమీపంలో స్వయంగా జిల్లా కలెక్టర్ మొక్కలను నాటారు. అనంతరం ఆర్డిఓ మహేష్, ఇంచార్జ్ మున్సిపల్ కమిషనర్ సాయి కృష్ణ మొక్కలను నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వర్ణాంధ్ర-స్వచ్ఛద్ర కార్యక్రమంలో భాగంగా నేడు ధర్మవరం మున్సిపాలిటీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం నాకేంతో సంతోషంగా ఉందని తెలిపారు. పట్టణ గ్రామీణ ప్రాంతాలలో ప్రతి మూడవ శనివారం పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తూ జిల్లాను ముందడుగు లో ఉండే విధంగా ప్రజలందరూ కృషి చేయాలని తెలిపారు. ప్రతి వ్యక్తి పర్యావరణ పట్ల బాధ్యతగా ఉండటంతో పాటు మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యత చేపట్టాలని తెలిపారు. అప్పుడే ఆరోగ్యంతో పాటు ఆనందంగా ఉండడం జరుగుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, ఇండ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, అనుకూలమైన ప్రాంతాలలో కూడా మొక్కలను నాటుతూ సంరక్షించుకునే బాధ్యత కూడా స్వీకరించాలని తెలిపారు. ఇప్పటికే 15 లక్షల మొక్కలు ఫారెస్ట్ కేంద్రంలో ఉన్నాయని, వీటిని తగినచోట నాటాలని తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతం చెట్లను నరకడం కూడా చట్టరీత్యా నేరమని,అలాంటి వారి పైన కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు కూడా నమోదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, టిపిఆర్ఓ విజయభాస్కర్, టిపిఓ అలివేలమ్మ, మున్సిపల్ డీఈ వీరేష్, అటవీ శాఖ అధికారులు మల్లికార్జున, ఆక్కులప్ప, పుల్లప్ప, గిరీష్, సచివాలయ ఉద్యోగులు, సి ఎస్ డి టి ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.
The post ప్రజలందరూ పర్యావరణం పట్ల బాధ్యతగా ఉండాలి appeared first on Visalaandhra.
ఈ సంవత్సరంలో కోటి మొక్కలను నాటడమే మా లక్ష్యం.. పుట్టపర్తి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్విశాలాంధ్ర ధర్మవరం : ప్రజలందరూ పర్యావరణ పట్ల బాధ్యతగా ఉండాలని, ఈ సంవత్సరంలో కోటి మొక్కలను నాటడమే లక్ష్యము అని పుట్టపర్తి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా హిందూపూర్ రోడ్డు, ఎర్రగుంట బ్రిడ్జ్ అవతల గల రోడ్డు సమీపంలో స్వయంగా జిల్లా కలెక్టర్ మొక్కలను నాటారు. అనంతరం ఆర్డిఓ మహేష్, ఇంచార్జ్ మున్సిపల్ కమిషనర్ సాయి కృష్ణ మొక్కలను నాటారు.
The post ప్రజలందరూ పర్యావరణం పట్ల బాధ్యతగా ఉండాలి appeared first on Visalaandhra.
