Headlines

స్త్రీతోనే శక్తివంతమైన కుటుంబం

విశాలాంధ్ర-రాప్తాడు : స్త్రీతోనే శక్తివంతమైన కుటుంబం సాధ్యమని డీఎంహెచ్ఓ ఈ.భ్రమరాంబదేవి అన్నారు. రాప్తాడు-2 సచివాలయ పరిధిలో డాక్టర్ శివకృష్ణ, డాక్టర్ శ్రావణి ఆధ్వర్యంలో ఆరోగ్యవంతమైన స్త్రీ శక్తివంతమైన కుటుంబము” కార్యక్రమాన్ని నిర్వహించారు.. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ స్త్రీ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబము వృద్ధిలోకి వచ్చి,దేశ భవిష్యత్తుకు దిక్సూచి అవుతుందన్నారు.
మహిళలకు కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, పౌష్టికాహారం పై అవగాహన, రక్తహీనత లోపము వలన కలిగే అనారోగ్యాలు, మాతా శిశు సంరక్షణ సేవలు, క్షయ వ్యాధి, వంశానుగత రక్త రుగ్మత, , మానసిక ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. అదేవిధంగా స్వర్ణ ఆంధ్ర స్వచ్చ ఆంధ్ర కార్యక్రమము క్రింద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సర్పచ్ సాకే తిరుపాల్, ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు, డెమో త్యాగరాజు, హెల్త్ ఎడ్యుకేటర్ గంగాధర్, సీహెచ్ఓ శివప్రసాద్, సూపర్వైజర్లు నరసింహ, అరుణ, ల్యాబ్ టెక్నిషియన్ శ్రీధర్ బాబు, ఫార్మసీ ఆఫీసర్ మూర్తి, ఐసీఎడిస్ సూపర్వైజర్ నాగరత్న, ఎం.ఎల్.హెచ్.పిలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

The post స్త్రీతోనే శక్తివంతమైన కుటుంబం appeared first on Visalaandhra.

​విశాలాంధ్ర-రాప్తాడు : స్త్రీతోనే శక్తివంతమైన కుటుంబం సాధ్యమని డీఎంహెచ్ఓ ఈ.భ్రమరాంబదేవి అన్నారు. రాప్తాడు-2 సచివాలయ పరిధిలో డాక్టర్ శివకృష్ణ, డాక్టర్ శ్రావణి ఆధ్వర్యంలో ఆరోగ్యవంతమైన స్త్రీ శక్తివంతమైన కుటుంబము” కార్యక్రమాన్ని నిర్వహించారు.. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ స్త్రీ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబము వృద్ధిలోకి వచ్చి,దేశ భవిష్యత్తుకు దిక్సూచి అవుతుందన్నారు.మహిళలకు కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, పౌష్టికాహారం పై అవగాహన, రక్తహీనత లోపము వలన కలిగే అనారోగ్యాలు, మాతా శిశు సంరక్షణ సేవలు, క్షయ వ్యాధి, వంశానుగత రక్త రుగ్మత, ,
The post స్త్రీతోనే శక్తివంతమైన కుటుంబం appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *