Headlines

చిట్టి తల్లీ నిశ్చింతగా చదువుకో.. కెజిబివిలో సీటు ఇప్పించే బాధ్యత నాది: లోకేష్

Nara Lokesh respond Child Labour

అమరావతి: కెజిబివిలో సీటు రాలేదని పత్తి పొలాల్లో కూలీగా వెళుతున్న జెస్సీ కథనం తనని కదిలించిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. చదువుకోవాలనే జెస్సీ ఆశను వెలుగులోకి తీసుకొచ్చిన మీడియాకు అభినందనలు తెలిపారు. నారా లోకేష్ తన సోషల్ మీడియా ఖాతాలో స్పందించారు. విద్యాశాఖ అధికారులతో మాట్లాడానని, చిట్టి తల్లీ! కెజిబివిలో సీటు వస్తుందని స్పష్టం చేశారు. నిశ్చింతగా చదువుకో! పరిస్థితులు ఏమైనా కానీ పుస్తకాలు, పెన్ను పట్టాల్సిన చేతులు పత్తి చేలో మగ్గిపోవడం బాధాకరమన్నారు. తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపితే తల్లికి వందనం వస్తుందని, చక్కనైన యూనిఫామ్, పుస్తకాలు, బ్యాగు, బూట్లు, సాక్సులు, బెల్టు ఇస్తున్నామని లోకేష్ స్పష్టం చేశారు. సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నామని, మన బడిలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యత మాది అని పేర్కొన్నారు. పిల్లల భద్రత -భవితకు భరోసానిచ్చే బడికి మించిన సురక్షిత ప్రదేశం లేదని, విద్యకు పిల్లలను దూరం చేయొద్దని తల్లిదండ్రులను వేడుకుంటున్నానన్నారు.

​అమరావతి: కెజిబివిలో సీటు రాలేదని పత్తి పొలాల్లో కూలీగా వెళుతున్న జెస్సీ కథనం తనని కదిలించిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. చదువుకోవాలనే జెస్సీ ఆశను వెలుగులోకి తీసుకొచ్చిన మీడియాకు అభినందనలు తెలిపారు. నారా లోకేష్ తన సోషల్ మీడియా ఖాతాలో స్పందించారు. విద్యాశాఖ అధికారులతో మాట్లాడానని, చిట్టి తల్లీ! కెజిబివిలో సీటు వస్తుందని స్పష్టం చేశారు. నిశ్చింతగా చదువుకో! పరిస్థితులు ఏమైనా కానీ పుస్తకాలు, పెన్ను పట్టాల్సిన చేతులు పత్తి చేలో మగ్గిపోవడం బాధాకరమన్నారు. తల్లిదండ్రులు  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *