Headlines

యోనెక్స్ స‌న్ రైజ్ ఆల్ ఇండియా సీనియ‌ర్ ర్యాంకింగ్ బ్యాడ్మింట‌న్ పోటీలు ప్రారంభం

విశాలాంధ్ర – రాజ‌మండ్రి సిటీ ;   యోనెక్స్ స‌న్ రైజ్ ఆల్ ఇండియా సీనియ‌ర్ ర్యాంకింగ్ బ్యాడ్మింట‌న్ పోటీలు -2025 ఆదివారం  సిటీ బ్యాడ్మింట‌న్  కోర్టు, బొప్ప‌న స్పోర్ట్స్ క్ల‌బ్ ల‌లో  ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. దేశంలోని 29 రాష్ట్రాల‌కు  చెందిన సుమారు 1500 మంది  బ్యాడ్మింట‌న్  క్రీడాకారులు ఈ పోటీల‌లో పాల్గొంటున్నారు. బ్యాడ్మింట‌న్ అసోసియేష‌న్ ఆఫ్  ఇండియా, ఆంధ్ర ప్ర‌దేశ్  బ్యాడ్మింట‌న్ అసోసియేష‌న్ అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్ర‌దేశ్ స‌హ‌కారంతో తూర్పు గోదావ‌రి జిల్లా బ్యాడ్మింట‌న్ అసోసియేష‌న్ ఈ పోటీల‌ను అత్యంత ఘ‌నంగా నిర్వ‌హిస్తోంది. సెప్టెంబ‌ర్ 21వ తేదీ నుంచి 28వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించే ఈ పోటీల‌లో భాగంగా 21వ తేదీ నుంచి క్వాలిఫైయింగ్ మ్యాచ్ లు ప్రారంభ‌మ‌య్యాయ‌ని, ఫైన‌ల్ పోటీలు 28వ తేదీన జ‌రుగుతాయ‌ని డిస్ట్రిక్ ఆర్గ‌నైజింగ్ సెక్ర‌ట‌రి  కొత్త‌ప‌ల్లి బాల సుబ్ర‌హ్మ‌ణ్యం తెలిపారు. భార‌త దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వ‌చ్చిన క్రీడాకారులు ఈ పోటీల‌లో పాల్గొంటున్నార‌ని, భార‌త దేశ స్థాయిలో  ఉభ‌య గోదావ‌రి జిల్లాలో మొట్ట‌మొద‌టి సారిగా ఈ టోర్న‌మెంటును నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఓఎన్ జిసి గెయిల్ స‌హ‌కారంతో జ‌రుగుతున్న ఈ పోటీలను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఎక్క‌డా ఎలాంటి లోపాలు లేకుండా చాలా ట్రాన్స‌ఫ‌రెంట్ గా ఈ పోటీల‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని, టోర్న‌మెంట్ ఆర్గ‌నైజింగ్ ప్రెసిడెంట్ , ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఈ టోర్న‌మెంటును ఇక్క‌డ నిర్వ‌హించ‌డానికి ఎంతో కృషి చేశార‌న్నారు.  నారాయ‌ణ‌పురంలో ఉన్న సిటీ బ్యాడ్మింట‌న్ కోర్టులో మొత్తం ఐదు  కోర్టులు, అలాగే బొప్ప‌న స్పోర్ట్స్ క్ల‌బ్ లో తొమ్మిది కోర్టులు ఉన్నాయ‌ని, వీటిలో 12 కోర్టుల‌లో ఈ పోటీలు నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా , ప్ర‌భుత్వ అండ దండ‌లు లేకుండా కేవ‌లం క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపి వారిని క్రీడ‌ల్లో ప్రోత్స‌హించ‌డానికి  బొప్ప‌న స్పోర్ట్స్ క్ల‌బ్ నిర్మించార‌ని,  తాము అడిగిన వెంట‌నే  ఈ పోటీల‌కు త‌మ బొప్ప‌న స్పోర్ట్స్ క్ల‌బ్ ను ఇచ్చిన బొప్ప‌న కృష్ణ చైత‌న్యకు ఈ సంద‌ర్భంగా ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
రాబోయే రోజుల్లో జాతీయ  స్థాయిలో ఏ విధ‌మైన టోర్న‌మెంటు అయినా నిర్వ‌హించ‌డానికి అన్ని ర‌కాల క్రీడా స‌దుపాయాలు రాజ‌మండ్రిలో ఉన్నాయ‌ని దీనికి స‌హ‌క‌రిస్తున్న కూట‌మి ప్ర‌భుత్వ నేత‌లంద‌రికీ పేరు పేరున త‌మ అసోసియేష‌న్ త‌ర‌పున కృత‌జ్ఞ‌తలు తెలిపారు. ఇలాంటి పెద్ద పెద్ద టోర్న‌మెంట్లు భ‌విష్య‌త్ లో మ‌రిన్ని చేయ‌డానికి కృషి చేస్తామ‌ని, క్రీడాకారులంతా ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకోవాల‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా కోరారు

The post యోనెక్స్ స‌న్ రైజ్ ఆల్ ఇండియా సీనియ‌ర్ ర్యాంకింగ్ బ్యాడ్మింట‌న్ పోటీలు ప్రారంభం appeared first on Visalaandhra.

​విశాలాంధ్ర – రాజ‌మండ్రి సిటీ ;   యోనెక్స్ స‌న్ రైజ్ ఆల్ ఇండియా సీనియ‌ర్ ర్యాంకింగ్ బ్యాడ్మింట‌న్ పోటీలు -2025 ఆదివారం  సిటీ బ్యాడ్మింట‌న్  కోర్టు, బొప్ప‌న స్పోర్ట్స్ క్ల‌బ్ ల‌లో  ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. దేశంలోని 29 రాష్ట్రాల‌కు  చెందిన సుమారు 1500 మంది  బ్యాడ్మింట‌న్  క్రీడాకారులు ఈ పోటీల‌లో పాల్గొంటున్నారు. బ్యాడ్మింట‌న్ అసోసియేష‌న్ ఆఫ్  ఇండియా, ఆంధ్ర ప్ర‌దేశ్  బ్యాడ్మింట‌న్ అసోసియేష‌న్ అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్ర‌దేశ్ స‌హ‌కారంతో తూర్పు గోదావ‌రి
The post యోనెక్స్ స‌న్ రైజ్ ఆల్ ఇండియా సీనియ‌ర్ ర్యాంకింగ్ బ్యాడ్మింట‌న్ పోటీలు ప్రారంభం appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *