Headlines

పేద ప్రజలకు ఆరోగ్యమును ఇవ్వడమే మా లక్ష్యం..

క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి)
విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు ఆరోగ్యమును ఇవ్వడమే మా లక్ష్యం అని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం అధ్యక్షులు బివి రమణ, క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి) తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణములో 115వ ఉచిత వైద్య చికిత్స శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిష్ణాతులైన వైద్యులచే రోగులకు ప్రత్యేక వైద్య చికిత్సలను అందించడం జరిగిందని, అదేవిధంగా ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా వివరించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరంలో 300 మంది రోగులకు వైద్య శిథిషలతో పాటు ఒక నెలకు సరిపడు మందులను కూడా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ శిబిరానికి దాతగా శీలం ప్రకాష్ వ్యవహరించడం పట్ల, వారిని ప్రత్యేకంగా అభినందించి కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు సిరివెళ్ల రాధాకృష్ణ, మామిళ్ళ అశ్వత్ నారాయణ తోపాటు బండి నాగరాజు, బంధనాదం చిన్నికృష్ణ ,డాక్టర్ వినయ్, కాచర్ల నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.

The post పేద ప్రజలకు ఆరోగ్యమును ఇవ్వడమే మా లక్ష్యం.. appeared first on Visalaandhra.

​క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి)విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు ఆరోగ్యమును ఇవ్వడమే మా లక్ష్యం అని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం అధ్యక్షులు బివి రమణ, క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి) తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణములో 115వ ఉచిత వైద్య చికిత్స శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిష్ణాతులైన వైద్యులచే రోగులకు ప్రత్యేక
The post పేద ప్రజలకు ఆరోగ్యమును ఇవ్వడమే మా లక్ష్యం.. appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *