Headlines

Chiranjeevi : 47 ఏళ్ళు.. కొణిదెల శివ శంకర వరప్రసాద్ అనబడే నేను.. మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ పోస్ట్..

Chiranjeevi Special Post on Completing 47 Years of Pranam Khareedu Movie

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సపోర్ట్ లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చి స్టార్ గా ఎదిగి ఇండస్ట్రీని రూల్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 70 ఏళ్ళ వయసులో కూడా ఇప్పటి తరం హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్నారు. చిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదు వచ్చి 47 ఏళ్ళు పూర్తవడంతో మెగాస్టార్ స్పెషల్ ట్వీట్ చేసారు.(Chiranjeevi)

మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్ లో.. 22 సెప్టెంబర్ 1978. కొణిదెల శివ శంకర వరప్రసాద్ అనబడే నేను “ప్రాణం ఖరీదు” చిత్రం ద్వారా ‘చిరంజీవిగా’ మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా, ఒక మెగాస్టార్ గా.. అనుక్షణం నన్ను ఆదరించి, అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను. నేటికి 155 సినిమాలను నేను పూర్తి చేసుకున్నాను అంటే అందుకు కారణం నిస్వార్ధమైన మీ ప్రేమ. ఈ 47 ఏళ్ళలో నేను పొందిన ఎన్నో అవార్డులు, గౌరవమర్యాదలు నావి కావు, మీ అందరివీ, మీరందించినవి. మనందరి మధ్య ఈ ప్రేమానుబంధం ఎల్లప్పటికీ ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటూ… కృతజ్ఞతలతో మీ చిరంజీవి అని రాసుకొచ్చారు.

Also Read : Kalyan Dasari : OG ట్రైలర్ రిలీజ్ చేయండ్రా అంటే.. హీరోగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసుకున్న నిర్మాత..

దీంతో మెగాస్టార్ చిరంజీవి వెండితెరపైకి వచ్చి 47 ఏళ్ళు అవ్వడంతో సినీ ప్రముఖులు, ఫ్యాన్స్, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

Also See : Pawan Kalyan : కటానాతో పవన్ కళ్యాణ్ స్టైలిష్ పోజులు.. OG ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పెషల్ ఫొటోలు..

​చిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదు వచ్చి 47 ఏళ్ళు పూర్తవడంతో మెగాస్టార్ స్పెషల్ ట్వీట్ చేసారు. (Chiranjeevi)  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *