Headlines

Singareni Workers: సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్‌.. బోనస్‌ ప్రకటించిన ప్రభుత్వం.. ఎంతంటే? ఏకంగా..

Singareni Workers

Singareni Workers: సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కారు బోనస్‌ ప్రకటించింది. గత ఏడాది 33 శాతం వాటాను కార్మికులకు పంచిన విషయం తెలిసిందే. ఈ సారి ఒక్కో కార్మికుడికి బోనస్‌గా రూ.1,95,610 పంపిణీ జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. మొత్తం రూ.819 కోట్లను సింగరేణి కార్మికులకు పంపిణీ చేస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. “సింగరేణి సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ఆత్మవంటిది. ఈ సంస్థ బొగ్గు గని మాత్రమే కాదు.. అది ఒక ఉద్యోగ గని. సింగరేణి సంస్థను జాగ్రత్తగా నడుపుతున్న యాజమాన్యానికి అభినందనలు. (Singareni Workers)

Also Read: కేటీఆర్ ఆ కార్లలో ఎందుకు తిరుగుతున్నారు?: బండి సంజయ్ 

సింగరేణి సంస్థలో అన్ని రకాల ఉద్యోగులు కలిసి 71 వేల మంది ఉన్నారు. కోల్‌ఇండియాలో ఇవ్వని అలవెన్సులు కూడా మేము ఇక్కడ ఇస్తున్నాం” అని తెలిపారు. సింగరేణి సంస్థను నష్టాల్లోకి నెట్టాలని గత బీఆర్ఎస్‌ సర్కారు ప్రయత్నించిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. సంస్థ మొత్తం రూ.6,394 కోట్ల లాభాలను అర్జించిందని అన్నారు.

​సింగరేణి సంస్థను నష్టాల్లోకి నెట్టాలని గత బీఆర్ఎస్‌ సర్కారు ప్రయత్నించిందని భట్టి విక్రమార్క ఆరోపించారు.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *