Headlines

శ్రీమురళి ‘పరాక్‌’ మొదలైంది

‘బగీరా’ విజయం తర్వాత హీరో శ్రీమురళి నటించబోయే చిత్రం ‘పరాక్‌’. ఈ చిత్ర ముహూర్త వేడుక మంగళవారం బెంగళూరులోని బండి మహాకాళి ఆలయంలో జరిగింది. ఈ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా చన్నగిరి ఎమ్మెల్యే శివగంగ బసవరాజు క్లాప్‌ కొట్టి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హీరో శ్రీమురళి విలేకరులతో మాట్లాడుతూ, ”పరాక్‌’ ఒక వింటేజ్‌ స్టైల్‌ సినిమా. నా నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ కథ ఎంచుకోవడానికి దాదాపు 200 స్క్రిప్ట్‌లను విన్నాను. నేను గత రెండు సంవత్సరాలుగా ‘పరాక్‌’ టీంతో ప్రయాణించాను. ఈ నెల నుండి షూటింగ్‌ ప్రారంభమవుతుంది. చరణ్‌ రాజ్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు’ అని తెలిపారు. ఈ చిత్రానికి హలేష్‌ కోగుండి దర్శకత్వం వహిస్తారు. కొన్ని షార్ట్‌ ఫిలిమ్స్‌కి పనిచేసిన తర్వాత ఆయన ఈ సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని బ్రాండ్‌ స్టూడియోస్‌ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం : చరణ్‌ రాజ్‌, సినిమాటోగ్రాఫర్‌ : సందీప్‌ వల్లూరి, ఆర్ట్‌ డైరెక్టర్‌ : ఉల్లాస్‌ హైదూర్‌.

The post శ్రీమురళి ‘పరాక్‌’ మొదలైంది appeared first on Navatelangana.

​‘బగీరా’ విజయం తర్వాత హీరో శ్రీమురళి నటించబోయే చిత్రం ‘పరాక్‌’. ఈ చిత్ర ముహూర్త వేడుక మంగళవారం బెంగళూరులోని బండి మహాకాళి ఆలయంలో జరిగింది. ఈ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా చన్నగిరి ఎమ్మెల్యే శివగంగ బసవరాజు క్లాప్‌ కొట్టి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హీరో శ్రీమురళి విలేకరులతో మాట్లాడుతూ, ”పరాక్‌’ ఒక వింటేజ్‌ స్టైల్‌ సినిమా. నా నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ కథ ఎంచుకోవడానికి దాదాపు 200 స్క్రిప్ట్‌లను విన్నాను. నేను గత రెండు
The post శ్రీమురళి ‘పరాక్‌’ మొదలైంది appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *