పాక్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాం: తిలక్ వర్మ
మన తెలంగాణ/హైదరాబాద్: ఆసియాకప్ టోర్నమెంట్ ఫైనల్లో అసాధారణ బ్యాటింగ్‌తో భారత్‌కు ట్రోఫీని అందించిన స్టార్ ఆటగాడు తిలక్‌వర్మ మంగళవారం హైదరాబాద్‌లో సందడి చేశాడు. అతను తన చిన్ననాటి కోచింగ్ సెంటర్ లింగంపల్లిలోని లేగల గ్రౌండ్‌ను సందర్శించాడు. అనంతరం అక్కడ విలేకరులతో ముచ్చటించిన తిలక్ వర్మ ఆసియాకప్ గురించి పలు విషయాలు వెల్లడించాడు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్నాడు. ఇలాంటి స్థితిలో ఆసియాకప్‌లో దాయాదిల మధ్య జరిగిన మ్యాచుల్లో ఘర్షణ వాతావరణం…
